ఫేస్బుక్ పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న ఇద్దర్ని ఇంకా మర్చిపోలేదు..! ఇంతలో ఈ లవ్ జంట మెసేజ్ పెట్టి సూసైడ్..!

పొందూరుకు చెందిన ఆచంటి మహాలక్ష్మి(19), రాజాం నగరపంచాయతీ పరిధి కొండంపేటకు చెందిన ఇజ్జిపురపు విజయ్‌కుమార్‌(19) రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. మహాలక్ష్మికి చెందిన కుటుంబీకులు నెలరోజుల క్రితం రాజాంలోని వారు చదువుతున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చేరుకొని కళాశాల యాజమాన్యంతో తగాదాకు దిగినట్టు తెలిసింది. దీంతో పాటు మహాలక్ష్మిని అక్కడ చదువు మాన్పించేసి శ్రీకాకుళంలోని ఓ కళాశాలలో చేర్పించారు. ఈ ఘటనతో విజయ్‌కుమార్‌కు మహాలక్ష్మికి మధ్య దూరం ఎక్కువైంది. ఈ దూరాన్ని జీర్ణించుకోలేక వీరు మానసిక క్షోభ అనుభవించారు.

చివరకు ఈ నెల 24న సాయంత్రం విజయ్‌కుమార్‌ రాజాంలోని ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్లాడు. మరోవైపు మహాలక్ష్మి కూడా శుక్రవారం తెల్లవారుజాము నుంచి కనిపించలేదు. దీంతో ఒకవైపు మహాలక్ష్మి కుటుంబీకులు, మరోవైపు తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఈ సమయంలో ఇరు కుటుంబాలకు చెందిన సెల్‌ ఫోన్లకు మేము చనిపోతున్నామనే మెసేజ్‌లు ప్రేమికులు నుంచి వచ్చాయి.

ఇంతలోనే పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో మహాలక్ష్మి, విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన సమాచారం రావడంతో ఇరు కుటుంబీకులు బోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి మహాలక్ష్మి, విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరి పక్క ఒకరు రైల్వే పట్టాలకు అడ్డంగా పడుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇరువురి శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. వీటిని పోలీసులు ఒకచోట అమర్చారు.

 

Comments

comments

Share this post

scroll to top