మన “ఇండియన్ రైల్వేస్” గురించి చాలా మందికి తెలియని 10 విషయాలు ఇవే.! 4 వ ది అయితే.!

మ‌న ఇండియ‌న్ రైల్వేలు అంటేనే.. అదొక పెద్ద వ్య‌వ‌స్థ‌. ఎన్నో వేల రైళ్ల‌లో నిత్యం కొన్ని కోట్ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తుంటారు. కొన్ని కోట్ల మంది సిబ్బంది రైల్వేల్లో ప‌నిచేస్తుంటారు. అయితే మ‌నం నిత్యం ప్ర‌యాణించే రైళ్ల‌లో ప‌లు ర‌కాలు ఉంటాయి. ప్యాసింజ‌ర్ అని, ఎక్స్‌ప్రెస్ అని, సూప‌ర్ ఫాస్ట్ అని ఉంటాయి. వాటిల్లో చార్జీల రేట్లు కూడా మారుతాయి. ఇది స‌రే… అస‌లు ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… ఏమీ లేదండీ… రైల్వేల గురించి మ‌న‌కు ఎన్ని విష‌యాలు తెలిసినా ఎప్పుడు కొన్ని విష‌యాలు మాత్రం ఇంకా ఆస‌క్తిని క‌లిగిస్తూనే ఉంటాయి. అలాంటి ఆస‌క్తిని క‌లిగించే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. మ‌న దేశంలో అత్యంత నెమ్మ‌దిగా ప్ర‌యాణించే రైలు నీల్‌గిరి ఎక్స్‌ప్రెస్‌. దీని వేగం గంట‌కు 10 కిలోమీట‌ర్లు మాత్రమే.

2. మ‌న దేశంలో అత్యంత వేగంగా ప్ర‌యాణించే రైలు ఢిల్లీ-ఆగ్రా మ‌ధ్య న‌డిచే గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్. ఇది గంట‌కు గ‌రిష్టంగా 160 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.

3. దిబ్రుగ‌డ్ నుంచి కన్యాకుమారి ప్ర‌యాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్ మ‌న దేశంలో బాగా ఎక్కువ కిలోమీట‌ర్లు, ఎక్కువ స‌మ‌యం పాటు ప్ర‌యాణించే రైలుగా పేరుగాంచింది. ఈ రైలు 4,273 కిలోమీట‌ర్ల దూరాన్ని క‌వ‌ర్ చేస్తుంది.

4. నాగ్‌పూర్‌, అజ్ని స్టేషన్ల మ‌ధ్య ఉండే దూరం కేవ‌ల 3 కిలోమీటర్లు మాత్ర‌మే. దేశంలో అతి త‌క్కువ దూరంలో ఉన్న‌ రెండు ప్ర‌ధాన స్టేష‌న్లు ఇవే కావ‌డం విశేషం.

5. ట్రివేండ్ర‌మ్ నుంచి నిజాముద్దీన్ వెళ్లే రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ వ‌డోద‌ర‌, కోట స్టేష‌న్ల మ‌ధ్య ఏకంగా 528 కిలోమీట‌ర్ల దూరం నాన్‌స్టాప్ గా ప్ర‌యాణిస్తుంది.

6. మ‌న దేశంలో బాగా ఎక్కువ‌గా స్టేష‌న్ల‌లో ఆగే రైలు ఒక్క‌టే. అది హౌరా-అమృత్‌స‌ర్ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు ఏకంగా 115 చోట్ల ఆగుతుంది.

7. మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలో ఉన్న శ్రీ‌రాంపూర్‌, బెలాపూర్ అనే రెండు స్టేష‌న్లు రైల్వే ట్రాక్ చెరో ప‌క్క ఒకే ప్ర‌దేశంలో ఉంటాయి.

8. మ‌న దేశంలో నిత్యం ప్రయాణం చేసే అనేక రైళ్లు స‌రైన టైముకు రావు. కానీ వాటిల్లో మ‌రీ ముఖ్యంగా గౌహ‌తి, ట్రివేండ్రం మ‌ధ్య న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం ఎప్పుడూ 10 నుంచి 12 గంట‌లు ఆల‌స్యంగానే న‌డుస్తూ ఉంటుంది.

9. ఫెయిరీ క్వీన్ అన‌బ‌డే స్టీమ్ రైలింజ‌న్‌ను మ‌న దేశంలో 1855లో త‌యారు చేశారు. ఈ రైలింజ‌న్ ఇప్ప‌టికీ వాడుకలో ఉంది. దీంతో ప్ర‌పంచంలోనే బాగా పాత అయిన వాడుక‌లో ఉన్న రైలింజ‌న్‌గా ఇది పేరు గాంచింది.

10. మ‌న దేశంలో అత్యంత పొడ‌వైన రైలు సొరంగ మార్గం జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉంది. దీన్ని డిసెంబ‌ర్ 2012లో పూర్తి చేశారు. దీన్ని పిర్ పంజాల్ సొరంగం అని పిలుస్తారు. దీని పొడ‌వు 11.215 కిలోమీట‌ర్లు ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top