పిల్లలతో కలిసి “రాహుల్ ద్రావిడ్” అందరితో క్యూ లో నించున్నారు…ఇంతకీ క్యూ ఏంటి? తర్వాత ఏమైంది?

సినీ న‌టులు, క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు, ఇత‌ర వీఐపీలు.. వీరంతా ఒకే కేట‌గిరికి చెందుతారు. అదేనండీ.. సెల‌బ్రిటీ హోదాలో వారు ఉంటారు. ఎక్క‌డికి వెళ్లినా వారికి రాచ‌మ‌ర్యాద‌లు జ‌రుగుతాయి. సాధార‌ణ జ‌నాల్లా ఏ అంశంలోనూ వేచి ఉండాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డైనా వారికి సేవ‌లు ముందుగానే జ‌రుగుతాయి. అయితే పైన చెప్పిన లిస్ట్‌లో కొంద‌రు మాత్రం ఈ సెల‌బ్రిటీ హోదాకు దూరంగా ఉంటారు. వారు సాధార‌ణ జీవిత‌మే గ‌డుపుతారు. ఆడంబ‌రాల‌కు పోరు. మ‌న మాజీ క్రికెట‌ర్ రాహుల్ ద్రావిడ్ కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు. ద్రావిడ్ కూడా సెల‌బ్రిటీలా బిహేవ్ చేయ‌డు. సాధార‌ణ జ‌నాల్లో క‌ల‌సిపోతాడు.

పైన ఇచ్చిన కొన్ని ఫొటోల‌ను చూశారు క‌దా. అవి రాహుల్ ద్రావిడ్ సింప్లిసిటీని తెలియ‌జేస్తాయి. తాను ఒక గొప్ప క్రికెట్ ఆట‌గాడు. న‌లుగురిలోకి వెళ్తే ఎవ‌రైనే ఇట్టే ద్రావిడ్‌ను గుర్తిస్తారు. దాంతో సెల‌బ్రిటీలా రాచ మ‌ర్యాద‌ల‌ను అన్ని చోట్లా అనుభ‌వించ‌వ‌చ్చు. కానీ ద్రావిడ్ అలా చేయ‌డు. న‌లుగురిలో కలుస్తాడు. తానూ ఒక సాధార‌ణ పౌరున్నే అని గుర్తు చేస్తాడు. ఎక్క‌డికి వెళ్లినా జ‌నంలోనే ఉంటాడు. అందుకనే ద్రావిడ్‌ను చాలా మంది అభిమానిస్తారు. పైన ఇచ్చిన ఫొటోల్లో ద్రావిడ్ త‌న పిల్ల‌ల‌తోపాటు క్యూ లైన్‌లో ఉన్నాడు. ఓ సైన్స్ ఎగ్జిబిష‌న్‌కు త‌న పిల్ల‌ల‌కు తీసుకెళ్లిన ద్రావిడ్ ఎంట్రీ కోసం వారితోపాటు లైన్‌లోనే వేచి ఉన్నాడు. దీన్ని బ‌ట్టే చెప్ప‌వ‌చ్చు. ద్రావిడ్ ఎంత‌టి సింపుల్ ప‌ర్స‌నో..!

అయితే కేవ‌లం ద్రావిడ్ మాత్ర‌మే కాదు, అత‌ని పిల్ల‌లు కూడా అలాగే ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌. అచ్చం తండ్రిలాగే ఉంటార‌ట‌. వారు త‌మ తండ్రి గౌర‌వాన్ని త‌మ‌కు ఎక్క‌డా ఉపయోగించుకోర‌ట‌. ఒక సాధార‌ణ కుటుంబానికి చెందిన పిల్ల‌ల్లాగే చాలా మర్యాద‌గా ఉంటార‌ట. అవును మ‌రి, నేటి త‌రుణంలో చాలా మంది బ‌డాబాబుల పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల పేరు చెప్పుకుని బ‌లాదూర్ తిరుగుతున్నారు. వారి ప‌ర‌ప‌తిని అడ్డం పెట్టుకుని చేయ కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. అలాంటి వారితో పోలిస్తే ద్రావిడ్ పిల్ల‌లు చాలా గొప్ప‌వార‌నే చెప్ప‌వ‌చ్చు క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top