రాహుల్, చాందిని జంటగా నటించిన “హౌరా బ్రిడ్జ్” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

Krishna

Movie Title (చిత్రం): హౌరా బ్రిడ్జ్ (Howrah Bridge)

Cast & Crew:

  • నటీనటులు: రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, అజయ్ తదితరులు
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • నిర్మాత:  మండవ నాగేశ్వర రావు (ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్)
  • దర్శకత్వం: రేవన్ యాదూ

Story:

ఇంట్లో పెద్దలు పెళ్లి చేసుకోమని చెప్పడంతో తెలియనివారిని పెళ్లాడడం కంటే తనకు చిన్నప్పట్నుంచి తెలిసిన స్వీటీ ని ప్రేమించి పెళ్లాడాలని నిశ్చయించుకొని కలకత్తా నుండి మాచవరం వస్తాడు అజయ్ (రాహుల్ రవీంద్రన్). అక్కడి లోకల్ పెద్ద మనిషి (అజయ్) మరదలైన స్వీటీ (చాందిని చౌదరి)ని తాను చిన్నప్పుడు ఇష్టపడ్డ స్వీటీ అనుకొని ఆమెను ప్రపోజ్ చేస్తాడు. కానీ.. అప్పటికే తనను చిన్నప్పట్నుంచి పెంచి తన ఉనికికి కారకుడైన బావను మోసం చేయలేక, తన మనసులో ఉన్న అజయ్ ను పెళ్లాడలేక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్న స్వీటికి ఉన్నట్లుండి షాక్ ఇస్తాడు అజయ్. దాంతో ఆత్మహత్యకు పూనుకుంటుంది స్వీటీ. అసలు స్వీటీ ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించింది? అజయ్ తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన స్వీటీకి ఇచ్చిన షాక్ ఏంటి? అనేది తెలియాలంటే “హౌరా బ్రిడ్జ్” చూడాలన్నమాట.

Review:

రాహుల్ రవీంద్రన్ సినిమాల్లో హీరోగా నటించడాన్ని పక్కనపెట్టి దర్శకత్వంవైపు ఎందుకు దృష్టి సారించాడు అనే విషయం ఈ సినిమా చూశాక అర్ధమవుతుంది. ఇకపోతే.. నటుడిగా క్యూట్ గా కనిపించినా ఎమోషన్స్ విషయంలో మాత్రం బాబు వర్కవుట్ చేయాల్సింది చాలా ఉంది. చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నప్పుడే కాస్త ఒద్దికగా, అందంగా కనిపించేది, కాస్తో కూస్తో నటించేది. కానీ సినిమాల్లోకి వచ్చాక క్యారీ వ్యాన్ మీద కాన్సన్ ట్రేషన్ ఎక్కువై తెరపై హావభావాలు పలికించడం మీద ధ్యాస మరల్చలేక సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడుతుంది. ఇక పాపం అజయ్ నటుడిగా తన పాత్రను పోషించిన విధానం బాగున్నా.. క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడంతో మనోడి పాత్రను నెగిటివ్ గా తీసుకోవాలా లేక అతడ్ని చూసి జాలిపడాలో అర్ధం కాదు సగటు ప్రేక్షకుడికి. రావురమేష్ ని ఓ వారం రోజులు డేట్స్ అడిగి కంగారు కంగారుగా షూట్ చేసినట్లుగా ఉంటాయి ఆయన సన్నివేశాలు.

శేఖర్ చంద్ర బాణీలు బాగున్నాయి. అయితే.. అవి చూడ్డానికి మాత్రం బాగోవు. అలాగే నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండు. విజయ్ మిశ్రా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. హీరోహీరోయిన్ల నడుమ వచ్చే శృంగార/రొమాన్స్ సీన్స్ కి పెట్టిన ఫ్రేమింగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే ఆ ఫ్రేమ్స్ పోస్టర్స్ వరకే పరిమితమవ్వడం బాధాకరం. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి కానీ.. ఆ ఖర్చు మొత్తం ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది తప్ప ప్రేక్షకుడి కంటికింపు కలిగించకపోవడం మైనస్. అసలు ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం ఎందుకు వస్తుంది అనే విషయంలో దర్శకుడికి ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ.. అవి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం ఉన్న క్లారిటీ పోయి బుర్ర వేడెక్కడం ఖాయం. అసలు సినిమా మొత్తం అయిపోయాక ఎండ్ క్రెడిట్స్ కి ముందు కలకత్తాలోని “హౌరా బ్రిడ్జ్”ను చూపించి టైటిల్ జస్టిఫై చేయడం అనేది వయబ్బో అనుకోకమానరు ఎవరైనా.

Plus Points:

సినిమాటోగ్రఫీ
రొమాన్స్ సన్నివేశాలు

Minus Points:

రాహుల్, చాందిని ఎక్స్ప్రెషన్స్
కథ కథనం
తల తోక లేని సీన్స్
సాంగ్స్ విసుఅల్స్

Final Verdict:

“హౌరా బ్రిడ్జి” టైటిల్ కి తగ్గట్టుగా సినిమా ఆకట్టుకోలేకపోయింది.

AP2TG Rating: 1 / 5

Trailer:

 

Comments

comments