చిన్నారి పెళ్లికూతురు ఫేమ్..ఆనందీ అందుకే చనిపోయిందా? ఫోన్ రికార్డ్స్ తో స్ఫష్టం.

మీకు ఆనంది తెలుసుగా..? అదేనండీ… చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌లో క్యారెక్ట‌ర్‌. చిన్న వ‌య‌స్సులో ఉన్న ఆనంది క్యారెక్ట‌ర్‌ను అవికాగోర్ పోషిస్తే, యుక్త వ‌య‌స్సు ఆనంది క్యారెక్ట‌ర్‌ను ప్ర‌త్యూష బెనర్జీ పోషించింది. వీరిద్ద‌రికీ ఇటు తెలుగునాటే కాదు, అటు హిందీ టీవీ, సినిమా రంగాల్లోనూ మంచి పేరు వ‌చ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్ర‌త్యూష బెన‌ర్జీ ముంబైలోని త‌న అపార్ట్‌మెంట్‌లోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా అందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగే కార‌ణ‌మ‌ని ఆమె త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అత‌న్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే అత‌ను ఇప్పుడు బెయిల్‌పై బ‌య‌టే ఉన్నాడు లెండి. కాగా ప్ర‌త్యూష బెన‌ర్జీ చ‌నిపోవ‌డానికి కొద్ది సేప‌టి ముందు రాహుల్ రాజ్ సింగ్‌తో మాట్లాడిన‌ట్టుగా భావిస్తున్న ఆమె ఫోన్ కాల్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఇంత‌కీ ఆ కాల్స్‌లో ఏముంది..?

ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌త్యూష బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, అంత‌కు కొన్ని నిమిషాల ముందు ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు, ఆమెకు మ‌ధ్య దాదాపుగా 3 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాష‌ణ కొన‌సాగింది. అయితే పోలీసులు ఈ మ‌ధ్యే స‌దరు ఫోన్ సంభాష‌ణ‌ల‌కు చెందిన టెలిఫోన్ రికార్డుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిసింది. వాటిలో ప్ర‌త్యూష‌కు, రాహుల్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం జ‌రిన‌ట్టుగా కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

rahul-prtyusha

ప్ర‌త్యూష బెన‌ర్జీ : నేను న‌టించేందుకు ఇండ‌స్ట్రీకి వ‌చ్చా. న‌న్ను నేను అమ్ముకోవ‌డానికి కాదు. రాహుల్‌, అస‌లు నువ్వు న‌న్ను ఏం చేయ‌మంటున్నావు..? నీకు తెలియ‌దు, నేను ఎంత‌గా ఫీల‌వుతున్నానో, నువ్వు చాలా స్వార్థ ప‌రుడివి. ఇండ‌స్ట్రీలో నా పేరు చెడ‌గొడుతున్నావ్‌. అంద‌రూ నా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నావ్‌.

ఇలా మాట్లాడుతున్న ప్ర‌త్యూష‌ను రాహుల్ కూల్ చేసేందుకు య‌త్నించాడు.

ప్ర‌త్యూష బెన‌ర్జీ : రాహుల్‌… అంతా అయిపోయింది. నేను కూడా అయిపోయాను. నేను చ‌నిపోయిన‌ట్టే లెక్క‌

రాహుల్ : ఏం చేసుకోవ‌ద్దు, నేను అర‌గంట‌లో వ‌స్తున్నా

ప్ర‌త్యూష బెన‌ర్జీ : అర‌గంట‌లో అంతా పూర్త‌యిపోతుంది.

అంతే, ఆ త‌రువాత వెంట‌నే ఆమె త‌న ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. రాహుల్ వ‌చ్చే స‌రికే ఆమె ప్రాణాలు గాలిలో క‌ల‌సిపోయాయి. ఆమెను వెంట‌నే హాస్పిట‌ల్‌కు చేర్చారు. అయితే అప్ప‌టికే ఆమె మృతి చెందింది.

పైన చెప్పినటువంటి ఫోన్ సంభాష‌ణ‌ల‌ను ఒక సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే మీకే తెలుస్తుంది. అవును, మీరు ఊహించిందే. రాహుల్ సింగే స్వ‌యంగా ప్ర‌త్యూష‌ను వ్య‌భిచారం చేయ‌మ‌ని అడిగాడ‌ట‌. అందుకు ఆమె ఒప్పుకోక ఫోన్‌లో అలా మాట్లాడింద‌ట‌. ఈ క్ర‌మంలో స‌ద‌రు రికార్డింగ్స్ బ‌య‌టికి వ‌చ్చిన నేప‌థ్యంలో మీడియా రాహుల్‌ను ప్ర‌శ్నించ‌గా అత‌ను ఏమంటున్నాడంటే త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని, నిజానికి ఆమె చాలా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంద‌ని, ఆమె త‌ల్లిదండ్రులే ఆమెను వేధిస్తున్నార‌ని, తాను మాత్రం ఆమెకు స‌పోర్ట్‌గానే ఉంటూ వ‌చ్చాన‌ని చెప్పాడు. మరి ప్ర‌త్యూష కేసులో చివ‌ర‌కు క‌థ ఎలా మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా మ‌నం ఊహించినంత ఆక‌ర్ష‌ణీయంగా మాత్రం న‌ట‌నా ప్ర‌పంచం ఉండ‌దు. అది తెలుగైనా, హిందీ అయినా, ఇంకో భాష అయినా ఒక‌టే..!

Comments

comments

Share this post

scroll to top