ఈ టీవీ షోలో శృతిమించుతున్న రొమాన్స్..మిడ్ నైట్ మసాలా అంటున్న ఆడియన్స్.! “సుమ” పై కూడా కామెంట్స్!

యాంకర్ అనే పదానికి పర్యాయపదంగా తన పేరు చెప్పుకోవచ్చు..తనను స్పూర్తిగా తీసుకునే ఎందరో యాంకర్స్ అయ్యారు..ఇప్పటికీ ఎంత మంది యాంకర్స్ అయినప్పటికీ కూడా తన స్థానాన్ని మాత్రం ఎవరూ తీసుకోలేకపోయారు..ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఆమె సొంతం..ఇంటిల్లిపాది కూర్చుని తన యాంకరింగ్ ని,తన మాటతీరుని,అల్లరిని,స్పాంటెనిటినీ ఎంజాయ్ చేస్తుంటారు.. అమ్మలు,అమ్మమ్మలు,అమ్మాయిలు ,అబ్బాయిలు అని తేడాలేకుండా అందరూ తనను ఇష్టపడుతుంటారు..తనే ఒన్ అండ్ ఓన్లీ సుమ…

తెలుగు వారయ్యుండి తెలుగుని అష్టవంకర్లుగా మాట్లాడే యాంకర్స్ చాలామంది మన తెలుగు మీడియాలో ఉన్నారు అలాంటిది…తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు చక్కగా మాట్లాడుతుంది.రికార్డ్ ప్రోగ్రామ్ అయినా,లైవ్ షో అయినా సంధర్బానికి తగ్గట్టు ఛలోక్తులు విసురుతుంది..ఎదుటివారు డిఫెన్స్ లో పడేయాలని చూసినా సమయస్పూర్తితో తిప్పికొడుతుంది..తప్పుగా మాట్లాడితే నిర్మోహమాటంగా ముఖంపైనే చెప్పేస్తుంది…రాజీవ్ కనకాల భార్య,దేవదాస్ కనకాల కోడలు అయ్యుండి ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ,ప్రెగ్నెన్సీ టైంలో యాంకరింగ్ కి ఆటంకం ఏర్పడితే,తర్వాత కాలంలో తన పలుకుబడి ఉపయోగించుకోకుండా విజయవాడ వెళ్లి అక్కడి లోకల్ ఛానెల్స్ లో తన కెరీర్ మళ్లీ కింది నుండి స్టార్ట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చింది..

అలాంటి సుమ గారు ఇప్పుడు ఇంత పేరు సంపాదించాక ఇలాంటి ప్రోగ్రాం ఎందుకు యాంకిరంగ్ చేస్తున్నారో అర్దం కావట్లేదు..సుమ కి అభిమానిగా చెప్తున్నా ఆ ప్రోగ్రాంలో వచ్చే మీరు మాట్లాడే ఏ మాట కూడా వినడానికి  బాగలేవు,అసలు ప్రోగ్రామే చూడ్డానికి బాగాలేదు…తెలుగుజాతికి ప్రాతినిధ్యమనే ఛానెల్ వాటిని ప్రసారం చేయడం దౌర్భాగ్యం..సై సై సయ్యారే ప్రోగ్రాంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి పాటల గురించి వివరణ ప్రోగ్రామ్ ఇది..దీని పట్ల సర్వత్రా వ్యతిరేఖత వస్తుంది..ఇప్పటికే ఈటివి లో వచ్చే జబర్దస్త్,పటాస్ వంటి షోస్ ని వ్యూయర్స్ వ్యతిరేకిస్తుంటే మరొవైపు ఈ షో. ఇంటిల్లిపాది కూర్చుని చూడగలిగే సినిమాలు ఎలాగూ రావట్లేదు..కనీసం టివి కూడా చూసే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి సుమ యాంకర్ చేయడం సుమ అభిమానులకే కాదు మామూలు జనాలకు నచ్చట్లేదు..కావలంటే మీరే ఓ లుక్కేయండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top