ఒకప్పుడు కార్ క్లీనర్…ఇప్పుడు ఎన్నో కార్లకు ఓనర్ ఆ టాప్ డైరెక్టర్..! ఎలా అయ్యాడో తెలుసా..?

Krishna

సినిమా ఇండస్ట్రీ ఎవరికి రెడ్ కార్పెట్ పరిచి వెల్ కం చెప్పదో..ఎవరో ఒకరిద్దరికి తప్ప..టాలెంట్ ఉంటే మాత్రం ఎలాంటి వాన్నైనా అక్కున చేర్చుకుంటుంది..దానికి ఉదాహరణే రజినికాంత్..ప్రకాశ్ రాజ్,షియాజి షిండే..వీళ్లంతా కూడా ఒకప్పుడు వేరే  పనులు చేసిన వారే..కింది స్థాయి నుండి పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు..ఇప్పుడు వాళ్లల్లో రాఘవ లారెన్స్ కూడా చేరాడు..లారెన్స్ ఒకప్పుడు ఏంచేసేవాడో తెలుసా..సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..ఈ స్థాయికి ఎలా వచ్చాడో తెలుసా..?

లారెన్స్ కొరియోగ్రాఫర్ గా ,హీరోగా ,దర్శకుడిగా..ఇప్పుడు పిల్లల్ని ఆదుకుంటున్న వాడిగా మనకు తెలుసు..కానీ వీటన్నింటికన్నా ముందు లారెన్స్ ఏం చేసేవాడో తెలుసా..క్లీనర్ గా పనిచేసేవాడు..మీరు చదివింది నిజమే.అప్పట్లో దక్షిణాదిన సూపర్ ఫైట్ మాస్టర్స్ లో సూపర్ సుబ్బరాయన్ ఒకరు. ఆయన తన ఫైట్ సీన్స్ తో ఆకట్టుకునేవాడు. చిన్న వాళ్ళ దగ్గరి నుంచి అప్పటి పెద్దపెద్ద స్టార్స్ వరకు ఆయనే ఫైట్ కంపోజ్ చేసేవాడు.ఆ సమయంలో లారెన్స్ ఆయన దగ్గర కారు క్లీనర్ గా పనికి కుదిరాడు. డ్యాన్స్ చేస్తూ కారు తుడుస్తుండేవాడు. అలా డ్యాన్స్ చేస్తూ కారు తుడుస్తుండగా ఆ దృశ్యం కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినికాంత్ కంటపడింది.లారెన్స్ డ్యాన్స్ కు ముగ్దుడైన రజినీకాంత్ వెంటనే లారెన్స్ ను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా ట్రూప్ లో జాయిన్ చేశాడు.

ప్రభుదేవా వద్ద మెలుకువలు నేర్చుకుని… ఆ ట్రూప్ లోనే బెస్ట్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు లారెన్స్. ముఠామేస్త్రిలో లారెన్స్ డ్యాన్స్ ను చూసి మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనికి తన హిట్లర్ సినిమాలో అవకాసం ఇచ్చాడు…ముఠామేస్త్రీ సినిమాలో ఈ పేటకు నేనే మేస్త్రీ సాంగ్ లో ఉన్న సైడ్ డ్యాన్సర్స్లో లారెన్స్ కూడా ఒకడిగా కనిపిస్తాడు.హిట్లర్ సినిమాలో లారెన్స్ కొరియోగ్రఫికి అప్పట్లో అందరూ ఫిదా అయ్యారు.. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు లారెన్స్ కొరియోగ్రాఫి అందిస్తూ.. నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు రాఘవ. ఆ తనలోని టాలెంట్ ను బయటకు తీస్తూ మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వం వహించాడు.

Raghava lawrence

కారు క్లీనర్ గా పనిచేసిన రాఘవ ఇప్పుడు పదుల సంఖ్యలో కార్లకు ఓనర్. అంతేకాదు..  పేదలకోసం సహాయం చేస్తున్నాడు. గాఢ్ ఫాదర్ లేకపోయినా టాలెంట్ ఉంటే ,కష్టపడే తత్వం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనడానికి లారెన్స్ ఒక ఉదాహరణ..

Comments

comments