యాంకర్ రాధిక మృతి వెనుక బయటపడ్డ నిజాలు.! సూసైడ్ నోట్ లో ఏం రాసుంది అంటే.? రష్మీ స్పందించి.?

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేటలోని శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో నివసించే వెంకన్నగారి రాధిక V6 న్యూస్ ఛానల్ లో యాంకర్ గా విధులు నిర్వహిస్తోంది. మెదక్ జిల్లా మానేపల్లికి చెందిన రాధిక ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుంది. సువిల అపార్ట్ మెంట్ లో తల్లిదండ్రులు, చెల్లెలి కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆదివారం విధులు ముగించుకొని ఇంటికి వస్తూనే నేరుగా భవనం ఐదో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందకు దూకేసింది. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృ* చెందింది. రాధిక ఆరు నెలలుగా కుమారుడు భానుతేజారెడ్డి(14)తో సహా మూసాపేటలోని సోదరి రేణుక ఇంట్లో ఉంటోంది. కుమారుడు మానసికంగా ఎదగకపోవడం, భర్తతో విడిపోవడంతో ఆమె ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండేది.

ఆదివారం ఎప్పటిలాగానే విధులకు వెళ్లిన ఆమె రాత్రి 10 గంటలకు ఇంటికి బయలు దేరింది. సుమారు 10.30 గంటలకు ఇంటికి చేరుకున్న రాధిక నేరుగా ఐదో అంతస్తుకు వెళ్లింది. హ్యాండ్‌ బ్యాగ్‌ పక్కన పడేసి కిందకు దూకేసింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికులు బయటికొచ్చి చూడగా.. రాధిక రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు రాధిక హ్యాండ్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె పెన్సిల్‌తో రాసిన సూసైడ్ నోట్‌ దొరికింది.

‘కేవలం నేను డిప్రెషన్‌ వల్ల మాత్రమే చ*పోతున్నా. ఎవరూ కారణం కాదు. నా బ్రెయిన్‌ నా శత్రువు’ అని నోట్‌లో రాసి ఉంది.

రాధికారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పలువురు టీవీ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా రాధికారెడ్డి మృతిపై స్పందించింది. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన.. బాధలు తొలగిపోవని, మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని ఆమె ట్వీట్ చేసింది. రాధికారెడ్డిని తానెప్పుడూ కలవలేదని, కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని రష్మీ పోస్ట్ చేసింది. మానసిక ఒత్తిడి ఈరోజుల్లో ఆత్మహత్యలకు అతిపెద్ద కారణంగా మారుతోందని రష్మీ చెప్పింది. ఒత్తిడికి లోనైతే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడాలని.. అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించింది. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని రష్మీ ట్వీట్ చేసింది.

rashmi goutam in movie

Comments

comments

Share this post

scroll to top