మహిళల్లో స్ఫూర్తినింపేలా వీడియోను రూపొందించిన సినీ నటి రాధికా ఆప్టే…

‘అటు వైపు చూడకు… అక్కడికి వెళ్లకు… అలా చెయ్… ఇలా ఉండొద్దు…’ ఇవన్నీ మహిళలకు సమాజం విధించిన కట్టుబాట్లు. తరతరాలుగా సమాజం విధించిన అనేక నిర్బంధ నియమాలను అనేక శాతం మంది మహిళలు ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే వీటన్నింటికీ స్వస్తి చెప్పాలని అంటోంది సినీ నటి రాధికా ఆప్టే.

radhika-apte

‘నీ జీవితం నీ చేతుల్లో ఉంది. దాన్ని ఎవరూ నిర్దేశించలేరు. శరీర ఆకృతి ఎలా ఉన్నా, ఆకట్టుకునే విధంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు నువ్వే కాబట్టి. నీ జీవిత లక్ష్యాన్ని నువ్వే నిర్దేశించుకోవాలి. ఇతరులు దాన్ని నియంత్రించకూడదు. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అలాగే ఉండాలి. ఇతరులు అన్నారు కదా అనీ నిన్ను నువ్వు మార్చుకోకూడదు. నువ్వు ఎప్పటికీ నీలాగే ఉండాలి. నీకు ఏదనిపిస్తే అదే చేయాలి. సమాజం విధించిన కట్టుబాట్లను తెంచేయాలి.’ అంటూ రాధికా ఆప్టే స్వయంగా నటించి రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో బ్లష్ చానల్ ద్వారా ‘ఫైండ్ యువర్ బ్యూటిఫుల్’ పేరిట ఆమె అప్‌లోడ్ చేసిన ఆ వీడియో నేటితరం మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంది.

రాధికా ఆప్టే రూపొందించిన ఆ వీడియోను ఇప్పుడు మీరూ చూడవచ్చు…

Comments

comments

Share this post

scroll to top