రాధాకృష్ణులకు వివాహం జరిగింది ఇక్కడేనట.! ఈ స్థలం విశేషాలు తెలుసుకోండి.

రాధాకృష్ణలకు వివాహం జరిగిందని చాలా మందికి తెలియదు. రాధాకృష్ణులు ఒకటేనని చెబుతారు. ఇతిహాసాల నుండి కొన్ని సాక్ష్యాల ప్రకారం శ్రీకృష్ణుడు రాధను వివాహం చేసుకున్న చోటును, ఆ వివాహాన్ని ఎవరు జరిపించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లో మధురలోని బంధీర్ అడవిలో వీరి వివాహం జరిగింది. శ్రీగర్గ్ సన్హిత మరియు శ్రీకృష్ణ జన్మఖండన ప్రకారం రాధాకృష్ణుల వివాహాన్ని బ్రహ్మదేవుడు జరిపించగా, సకల దేవతలు హాజరై రాధాకృష్ణులను దీవించారని అందులో ఉంది. రాధాకృష్ణులకు వివాహం బంధీర్ అడవిలో ఒక చెట్టు కింద జరిగింది బ్రహ్మదేవుడు పూజారిగా ఈ వివాహాన్ని జరిపించాడు. ఇప్పటికీ ఆ చెట్టు అక్కడే ఉంది.

1_1452161108
శ్రీకృష్ణుడు చిన్న వయసులో ఉండగా, తన తండ్రి నందనవనుడు.. తన భుజాలపై ఎత్తుకొని బంధీర్ అడవిగుండా వెళ్తుండగా, మాయాలీలుడైన శ్రీకృష్ణుడు పెద్ద తుఫాన్ వరదను ఆ అడవిలో సృష్టించాడు.  తుఫాన్ వరదకు ఒక్కసారిగా విస్తుపోయిన నందనుడు, శ్రీకృష్ణుడుని తీసుకొని ఒక చెట్టు కిందకు పరుగెత్తి, దేవుడా మమ్మల్ని కాపాడు అని ప్రార్థించసాగాడు. అదే సమయంలో కృష్ణుడి ముందు రాధ ప్రత్యక్షమైంది. రాధాకృష్ణులను చూసిన నందనుడు వారిద్దరూ దేవుడి రూపంలో ఉన్నవారని గుర్తించి నమస్కారాలు జోడించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
2_1452161109
నందనుడు వెళ్ళిపోగానే శ్రీకృష్ణుడు తన అవతారంలోకి మారిపోయి రాధ ముందు నిలుచున్నాడు. రాధాకృష్ణులు ఆ అడవిలో ఏకాంతంగా సమయం గడుపుతున్నారు. కృష్ణుడిని చూస్తూ సిగ్గుపడిపోయింది రాధా. సమస్త విశ్వాన్ని శ్రీకృష్ణుడి అనుమతితోనే నడుస్తుందని అందులో ఉంది. ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడికి ప్రత్యక్షమై రాధాకృష్ణుల వివాహం జరిపించడానికి పూజారిగా వచ్చి కన్యాదాతగా మారి రాధాకృష్ణులను ఎదురెదుగా కూర్చోమని వారి ముందు అగ్నిప్రజ్వల చేసి వివాహం జరిపాడు. రాధాకృష్ణుల వివాహాన్ని సకల దేవతలూ వీక్షించి వారిని దీవించారు. అలా వారిద్దరి పెళ్లి జరిపించి బ్రహ్మ వెళ్లిపోయాడు.

Comments

comments

Share this post

scroll to top