ఐఏఎస్ అధికారిణి “స్మితా సబర్వాల్” దగ్గర పని చేసిన “జబర్దస్త్ ఫేమ్ కమెడియన్” ఎవరో తెలుసా..? ఎందుకు మానేసాడు?

జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ “రచ్చ రవి” ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసాడు. అతను ఇంతకముందు ఓ ఐఏఎస్ అధికారి ఆఫీస్ లో పనిచేసాడంట. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసాడు. ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ దగ్గర తాను పనిచేసినట్లు జబర్దస్త్ కమెడియన్ రచ్చరవి పేర్కొన్నాడు. ‘‘ స్మితాసబర్వాల్ మేడం వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు.. నేను తన దగ్గర జాబ్ చేసినప్పుడు తీయించుకున్న ఫొటో ఇది.’’ అని ఫోటోను పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం స్మిత సబర్వాల్ గారు సీఎం పేషీలో సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆమె గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రచ్చరవి ఆ మున్సిపల్ ఆఫీసులో స్మిత దగ్గర పనిచేసేశాడు. అనంతరం  హైదరాబాద్ వచ్చేసి, మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తతం కామెడీ షోలతో రచ్చరవి బిజీగా గడుపుతున్నాడు.

Comments

comments

Share this post

scroll to top