జూన్ 22న కుతుబ్ మినార్ నీడ భూమి మీద ప‌డ‌దు.. ఎందుకో తెలుసా?

కుతుబ్ మీనార్ మ‌న దేశ ప్రాచీన నిర్మాణ శాస్త్రానికి మ‌చ్చుతున‌క …ఇంజ‌నీరింగ్ ప్ర‌తిభ‌కు గీటురాయిగా చెప్ప‌వొచ్చు. అద్భుత‌మైన క‌ట్ట‌డ‌మే కాకుండా దాని వెన‌క ఓ ఆశ్చ‌ర్యక‌ర టెక్నాల‌జీ దాగుంది.! దాని గురించే ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

జూన్ 22 న ఈ కుతుబ్ మినార్ నీడ భూమి మీద ప‌డ‌దు.! దీనికి కార‌ణం దాని నిర్మాణం. 72.5 మీటర్ల ఎత్తున్న ఈ క‌ట్ట‌డం స‌రిగ్గా 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉండ‌డంతో పాటు 5 డిగ్రీలు వంపు కలిగి వుండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడటం లేదు.

కుతుబ్ మినార్ గురించి ఇంకాస్త క్షుప్తంగా..

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా “ధృవపుస్తంభం”. కుతుబుద్దీన్ ఐబక్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించ‌గా…ఇల్ టుట్ మిష్ పూర్తి చేశాడు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీని ప్రాంగణం లో ఉన్న ఇనుప స్థంబం ఇప్ప‌టి వ‌ర‌కు తుప్పు ప‌ట్ట‌కుండా అలాగే ఉండ‌డం మ‌రో విశేషం.

Comments

comments

Share this post

scroll to top