హిందువులు ఆవును ఎందుకు పూజిస్తారంటే..!

హిందువులు ఆవును దేవతగా పూజిస్తారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. ఆవును పూజించమని సాక్షాత్తూ శివుడే పార్వతీ దేవికి చెప్పాడనీ పురాణాల్లో ఉంది. 

ఆవు విశిష్టతలు..:

ఆవు పాలు

ఆవు పాలలో విటమిన్‌ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.రోజువారీ పోషణ ఖర్చు తక్కువ , రోజుకు 20లీటర్ల వరకూ పాలు ఇస్తాయి.పోషక విలువలు అధికం.గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ.

ఆవు పేడ

ఆవు పేడలో క్రిమి సంహరక గుణాలున్నయన్న నమ్మకం వల్ల ఇళ్ళు అలకడానికి ఉపయోగిస్తారు.

గోమూత్రం;

ఔషధంతో గోపంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌ పేటెంట్‌ గుర్తించింది.ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డీఎన్‌ఏను కాపాడేలా పనిచేస్తుందట.బాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని- రీ డిస్టిల్డ్‌ కౌ యూరిన్‌ డిస్టిలేట్‌( ‘కామధేను ఆర్క్‌’) అని నామకరణం చేశారు.

ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత ఆర్క్, చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషధ విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top