పీవీ..ఠీవీ ..!

తెలంగాణ ముద్దు బిడ్డ పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు అలియాస్ పీవీ. మేధావిగా..బ‌హుముఖ..
ప్ర‌జ్ఞాశాలిగా..ర‌చ‌యిత‌గా..రాజ‌నీతిజ్ఞుడిగా..త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కుడిగా ..దేశానికి దిశా నిర్దేశ‌నం చూపించిన మాన‌వుడిగా ఆయ‌న మ‌న‌కు గుర్తుండి పోతారు. ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు. అత్యున్న‌త ప్ర‌ధాన‌మంత్రిని చేప‌ట్టారు. ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టినా..ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించినా చ‌ద‌వ‌కుండా …రాయ‌కుండా ఉండ‌లేక పోయారు. నిత్య పాఠ‌కుడిగా ఉన్నారు. చ‌నిపోయే స‌మ‌యంలో సైతం ఆయ‌న ప‌క్క‌నే పుస్త‌కం ఉందంటే ఎంత‌గా అందులో లీన‌మై పోయారో అర్థం చేసుకోవ‌చ్చు. దేశం ఇత‌ర దేశాల‌తో సంబంధాలు నెరిపే విష‌యంలో పీవీ చూపించిన ప్ర‌తిభ గొప్ప‌ది. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నా ఏనాడూ దేబ‌రించ‌ని అరుదైన నాయ‌కుడు ఆయ‌న‌.

1921లో క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌న్మించిన పీవీ అధిరోహించిన‌న్ని ప‌ద‌వులు ఎవ‌రూ చేప‌ట్ట‌లేక పోయారు. న్యాయ‌వాదిగా, క‌విగా, ఉద్య‌మ‌కారుడిగా చివ‌రి వ‌ర‌కు ఉన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అధీష్టించిన మొట్ట మొద‌టి తెలుగు వారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. కుంటు ప‌డుతున్న వ్య‌వ‌స్థ‌ను తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కేంద్రంలో త‌గినంత బ‌లం లేక‌పోయినా మైనార్టీ స‌ర్కార్ ను పూర్తి కాలం పాటు న‌డిపించారు. 1938లో హైద‌రాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజాం ప్ర‌భుత్వ నిషేధాన్ని ధిక్క‌రిస్తూ వందేమాత‌రం గీతాన్ని పాడారు. దీంతో ఉస్మానియా యూనివ‌ర్శిటీ నుండి బ‌హిష్క‌రించ‌బ‌డ్డారు.

ఓ స‌హ‌చ‌రుడి సాయంతో నాగ‌పూర్ యూనివ‌ర్శిటీలో చేరి 1944 వ‌ర‌కు చ‌దివారు. స్వామి రామానంద‌తీర్థ‌, బూర్గుల‌తో క‌లిసి స్వాతంత్ర పోరాటంలోను, హైద‌రాబాద్ విముక్తి ఉద్య‌మంలో పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా ఉన్న ఆయ‌న చెన్నారెడ్డి, శంక‌రావు చ‌వాన్, వీరేంద్ర పాటిల్‌తో క‌లిసి ప‌నిచేశారు. 1951లో ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జ‌ర్న‌లిస్టుగా ప్రారంభించి..కాక‌తీయ ప‌త్రిక న‌డిపారు. బ‌హు భాష‌లు నేర్చుకున్నాడు. జ‌య అనే మారు పేరుతో 1950 వ‌ర‌కు రాశారు.

1957లో రాష్ట్ర రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి నాలుగుసార్లు శాస‌న‌స‌భ్యుడిగా గెలుపొందారు. 1962లో మంత్రి అయ్యారు. 1964 వ‌ర‌కు న్యాయ‌, స‌మాచార శాఖ మంత్రి ప‌దవి చేప‌ట్టారు. 1967 వ‌ర‌కు న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 71 దాకా స‌మాచార‌, న్యాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. కుల ప్రాబ‌ల్యం, పార్టీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు అధికంగా ఉండే ఏపీలో పీవీ నాయ‌కుడిగా ఎదిగారు. ఏ వ‌ర్గం లేకుండానే నెట్టుకు వ‌చ్చారు. రాష్ట్ర రాజ‌కీయాల‌లో అత్యున్న‌త స్థానం పొందారు. ఎంద‌రో ఉద్దండుల‌ను కాద‌ని పీవీ సీఎం కాగ‌లిగారు.

1969లో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం చ‌ల్లారింది. ఆ స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తిని సీఎం చేయాల‌ని అనుకున్నారు. వివాదాల జోలికి వెళ్ల‌ని పీవీ వైపు హై క‌మాండ్ త‌లొగ్గింది. 1971 సెప్టెంబ‌ర్ లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప‌ద‌వి రాగానే అస‌మ్మ‌తిని ఎదుర్కొన్నారు. హైద‌రాబాద్ – ఢిల్లీకి మ‌ధ్య తిర‌గ‌డంతోనే స‌రిపోయింది. ఆ స‌మ‌యంలో ముల్కీ నిబంధ‌న‌ల‌పై సుప్రీం ఇచ్చిన తీర్పుతో కోస్తా, రాయ‌ల‌సీమ నాయ‌కులు ప్ర‌త్యేక ఆంధ్ర కావాలంటూ జై ఆంధ్ర ఉద్య‌మాన్ని చేప‌ట్టారు. పీవీని తెలంగాణ ప‌క్ష‌పాతిగా చూపించారు. ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించారు.

1973లో కొత్త మంత్రుల‌ను తీసుకున్నారు. హై క‌మాండ్ ఒప్పుకోలేదు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసింది. రాష్ట్ర ప‌తి పాల‌న విధించారు. ఆ విధంగా పీవీ సీఎం శ‌కం ముగిసింది. 1977 దాకా ఉన్నా లేన‌ట్టే ఉన్నారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో 70 శాతం బీసీల‌కు టికెట్లు ఇచ్చాడు. క‌ర‌ణం లౌక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. భూసంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌పై భూస్వామ్య వ‌ర్గాలు తిర‌గ‌బ‌డ్డాయి. సీఎం ఉండ‌గానే చ‌ర్య‌లు తీస‌కున్నాడు. ప‌ట్ట‌ణ భూ గ‌రిష్ట ప‌రిమితి చ‌ట్టం తీసుకు వ‌చ్చారు. స‌మ‌కాలీన నేత‌ల‌తో స‌ఖ్య‌త‌తో లేక పోవ‌డం వ‌ల్ల‌నే ప‌ద‌వి కోల్పోయారు.

పీవీ హ‌స్తిన బాట ప‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. హ‌న్మ‌కొండ నుండి ఎంపీగా గెలిచారు. రెండోసారి కూడా విజ‌యం సాధించారు. మూడోసారి రాంటెక్ నుండి ఎన్నిక‌య్యారు. నంద్యాల నుండి గెలుపొందారు. 1980-89 మ‌ధ్య కాలంలో కేంద్రంలో హోం శాఖ‌, విదేశీ వ్య‌వ‌హారాల , మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ల మంత్రిగా నిర్వ‌హించారు.

పీవీని పీఎం ప‌ద‌వి అనుకోకుండా వ‌రించింది. 1991లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఉన్నారు. రాజీవ్ గాంధీ మృతి త‌ర్వాత పార్టీకి నాయ‌కుడు లేకుండా పోయారు. ఏ గ్రూపు లేని పీవీ ఆమోద యోగ్యంగా క‌నిపించారు. ఈ స‌మ‌యంలో పీవీ పీఎం అయ్యారు. సాటి తెలుగువాడు పోటీ చేస్తున్నాడ‌ని ఎన్టీఆర్ పోటీకి నిల‌బెట్ట‌లేదు. సంపూర్ణ మెజారిటీ లేని ప‌రిస్థితిని గ‌ట్టెక్కించిన ఘ‌న‌త పీవీదే. వివిధ శాఖ‌ల్లో ప‌నిచేసిన అనుభ‌వం పీఎం చేప‌ట్టేందుకు తోడ్పడ్డాయి. ఐదేళ్ల పాటు మైనార్టీతోనే మెజారిటీగా గెలిచారు. మ‌న్మోహ‌న్ సింగ్ ను ఆర్తిక మంత్రిగా తీసుకున్నారు. సంస్క‌ర‌ణ‌ల‌కు తెర లేపారు.

బాబ్రీ మ‌సీదు కూల‌గొట్ట‌డం ఆయ‌న హ‌యాంలోనే జ‌రిగింది. అవినీతి, ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఆర్తిక వ్య‌వ‌స్థ‌కు జీవం పోశారు. సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడిగా పేరొందారు. పంజాబ్‌లో నెలకొన్న తీవ్ర‌వాదాన్ని అణ‌చి వేశారు. కాశ్మీర్ తీవ్ర‌వాదులు ప్ర‌ముఖుల‌ను కిడ్నాప్ చేసినా చ‌లించ‌లేదు. పాక్ కు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆధారాల‌తో స‌హా చూపించారు. అణుప‌రీక్ష‌ల కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది పీవీనే. 1994లో అవిశ్వాస తీర్మానం నుండి గ‌ట్టెక్కేందుకు వ‌క్ర మార్గాలు అనుస‌రించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

ఆయ‌న కుటుంబీకుల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సాధువులు, బాబాల‌కు స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించారు. పీఎం గా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌లేదు. ప‌ద‌వి నుండి దిగి పోయాక కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అవ‌న్నీ వీగి పోయాయి. జార్ఖండ్ ముక్తీ మోర్చా అవినీతి కేసులో పీవీని నేర‌స్తుడిగా పేర్కొంది. ఆ త‌ర్వాత డిల్లీ కోర్టు కొట్టేసింది. ల‌ఖూభాయి పాఠ‌క్ అనే ప‌చ్చ‌ళ్ల వ్యాపారి చంద్ర‌స్వామికి డ‌బ్బిచ్చాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత ఈ మూడు కేసుల్లో నిర్దోషిగా బ‌య‌ట ప‌డ్డారు.

సాహితీ పిపాస‌కుడు పీవీ. రాజ‌కీయాలు, ప‌రిపాల‌నలో బిజీగా ఉన్నా..నిరంత‌రం కంప్యూట‌ర్‌ను ఉప‌యోగించారు. ఆయ‌న సాహిత్య కృషికి సాహిత్య అకాడెమీ పొందారు. ఇన్ సైడ‌ర్ పేరుతో రాసిన ఆత్మ‌క‌థ లోప‌లిమ‌నిషిగా ఇది అనువాద‌మైంది. ప‌లు భాష‌ల్లో ప్రావీణ్యం క‌లిగారు. విశ్వ‌నాథ రాసిన వేయిప‌డ‌గ‌లు పుస్త‌కాన్ని హిందీలోకి అనువాదం చేశారు.

జ‌య‌ప్ర‌భ క‌విత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. రాజీవ్ గాంధీని విమ‌ర్శిస్తూ వ్యాసాలు రాశారు. త‌న ఆత్మ‌క‌థ రెండో భాగం రాయాల‌న్న సంక‌ల్పంతో రాయ‌కుండానే 2004 డిసెంబ‌ర్ 23న ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు పీవీ. ఆయ‌న‌కు స్మృతి చిహ్నంగా దేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవ‌ర్ కు పీవీ పేరు పెట్టారు.

తెలంగాణ మారుమూల ప‌ల్లెలో జ‌న్మించిన ఓ సామాన్య‌మైన వ్య‌క్తి..దేశానికి ప్ర‌ధానిగా సేవ‌లందించి..చివ‌రి స‌మ‌యంలో ఎన్నో అవమానాలు భ‌రించి ..వెళ్లిపోయిన పీవీ ..మాన‌వుడు. ఆద‌ర్శ ప్రాయుడు.

Comments

comments

Share this post

scroll to top