భార‌త్ బ్యాడ్మింట‌న్ ఖాతాలో అరుదైన టైటిల్… పీవీ సింధు కైవ‌సం..!

రియో ఒలంపిక్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే మ‌న ఖాతాలో మ‌రో అరుదైన టైటిల్ వ‌చ్చి చేరింది. ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు చైనా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో గెలుపొంది మ‌రోసారి త‌న ఖ్యాతిని, త‌ద్వారా దేశ కీర్తి ప‌తాక‌ల‌ను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటింది. అత్యంత ఉత్కంఠగా జ‌రిగిన పోరులో చైనాకు చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ స‌న్ యు పై గెలుపొంది సూప‌ర్ సిరీస్ ప్రీమియ‌ర్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.

china-open-sindhu

చైనాలో జ‌రుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో పీవీ సింధు చైనాకు చెందిన 8వ సీడెడ్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ స‌న్ యు తో ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డింది. 7-2 లీడ్‌తో ఆరంభ‌మైన ఆట‌లో మొద‌టి నుంచి పీవీ సింధు ఆధిప‌త్యం ప్ర‌దర్శించింది. అనంత‌రం 11-6తో ఇంట‌ర్వెల్‌కు చేరుకుంది. అలా ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూనే వ‌రుస సెట్ల‌లో 21-11, 17-21, 21-11 తేడాతో చైనా క్రీడాకారిణి స‌న్ యు ను మ‌ట్టి క‌రిపించింది. దీంతో చైనా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టైటిట్‌, సూప‌ర్ సిరీస్ ప్రీమియ‌ర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కాగా గ‌త 30 సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతున్నఈ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చైనా ప్లేయర్లదే ఆధిప‌త్యం ఉంటూ వ‌స్తోంది. కేవ‌లం 3 సార్లు మాత్ర‌మే ఇత‌ర దేశాల‌కు చెందిన వారు గెలుపొందారు. అందులో అంత‌కు ముందు సైనా నెహ్వాల్ ది ఓ విజ‌యం ఉంది. అది కాక ఇప్పుడు సింధు ఈ టైటిల్‌ను సాధించ‌డంతో ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఆటలో భార‌త్ త‌న‌దైన ముద్ర‌ను వేసిన‌ట్టు అయింది. ఈ క్ర‌మంలో పీవీ సింధు గెలుపు ప‌ట్ల యావ‌త్ భార‌త ప్ర‌జానీకం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాని మోడీ స‌హా ప‌లువురు ఇత‌ర క్రీడాకారులు, ప్ర‌ముఖులు సింధుకు ట్విట్ట‌ర్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు. పారుప‌ల్లి క‌శ్య‌ప్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, అనురాగ్ ఠాకూర్‌, హ‌ర్ష భోగ్లే, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ‌దీప్ హుడా, జావేద్ అక్త‌ర్‌, ఈషా గుప్తా వంటి వారు సింధుకు ట్విట్ట‌ర్ వేదికగా అభినంద‌న‌లు తెలిపారు. సైక‌త శిల్పాల‌ను తీర్చిదిద్దే సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ పూరీ బీచ్‌లో పీవీ సింధుకు చెందిన బొమ్మ‌ను ఇసుక‌లో గీసి ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు.

Comments

comments

Share this post

scroll to top