ఫైనల్ కు సింధు..గెలిస్తే స్వర్ణం, ఓడితే రజతం.

మన హైద్రాబాదీ ఆశాకిరణం..P.V  సింధు  ఒలంపిక్స్ బాట్మింటన్  సెమీ ఫైనల్ లో అదరగొట్టింది. సెమీస్ లో తనకంటే మెరుగైన ర్యాంక్ గల జపాన్ కు చెందిన నొజోమీ ఒకుహారా ను వరుస సెట్లలో ఓడించింది.  వరల్డ్ ర్యాంక్ 10 లో ఉన్న పూసర్ల వెంకట సింధు తనకంటే నాలుగు ర్యాంకులు మెరుగైన ఒకుహారా( World Rank 6) ను వరుస సెట్ల (  21-19,21-10) లో  ఓడించింది.  21 యేళ్ల సింధు ఈ మ్యాచ్ లో తన అత్యున్నత ప్రతిభ కనబర్చింది. మొదటి సెట్ హోరా హోరీగా జరిగింది. గేమ్ స్టార్టింగ్ నుండి లీడ్ ను మెయింటేన్ చేసిన సింధు దానికి అలాగే కొనసాగించడంతో మొదటి సెట్ 2 పాయింట్ల తేడాతో గెలిచింది. రెండవ సెట్ స్టార్టింగ్ లోనే ఒకుహారా ఎదురుదాడికి దిగింది.  అయితే మొదటి సెట్ గెలిచిన కాన్ఫిడెన్స్ తో సింధు రెండవ సెట్ ను కూల్ గా ఆడి 11 పాయింట్ల తేడాతో సెట్ ను మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకొని ఫైనల్ కు చేరింది.

PV

పవర్ ఫుల్ స్మాష్ లు , నెట్ గేమ్ …. ప్రత్యర్థి అనవసర తప్పిదాలు సింధు విజయానికి కారణమయ్యాయి. ఆగస్ట్ 19 సాయంత్రం 7.30 నిమిషాలకు… సింధు స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ ( World Rank -1) తో ఫైనల్ మ్యాచ్ ను ఆడాల్సి ఉంది.  ఆ మ్యాచ్ లో గెలిస్తే గోల్డ్ మెడల్ , ఓడితే సిల్వర్ మెడల్  సింధుకు దక్కుతాయి.  # All The Best సింధు…మన సింధు బంగారు పతకంతో తిరిగిరావాలని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top