చ‌నిపోయిన వారి ఫొటోల‌ను పూజ‌గ‌దిలో ఉంచ‌కూడ‌దా..? ఉంచితే ఏమ‌వుతుంది తెలుసా..?

హిందువులు ఎవ‌రైనా త‌మ నివాసాల్లో పూజ గ‌దుల‌ను క‌చ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు. ఆ గ‌దుల్లో దేవుళ్లు, దేవ‌త‌ల చిత్ర‌పటాలు, విగ్ర‌హాల‌ను పెట్టి నిత్యం పూజ చేస్తారు. ఇది ఎక్కడైనా స‌హ‌జంగా జ‌రిగేదే. అయితే కొంద‌రు పూజ గ‌దుల్లో చ‌నిపోయిన వారి ఫొటోల‌ను ఉంచుతారు. ఇలా చేయ‌డం మంచిద‌ని, చ‌నిపోయిన వారు ఎటూ దైవంతో స‌మానమే క‌దా అని చెప్పి కొంద‌రు ఆ ప‌నిచేస్తారు. అందులో భాగంగానే నిత్యం దైవంతోపాటు ఆ ఫొటోల‌కు కూడా పూజ చేస్తారు. అయితే నిజానికి ఇలా చేయ‌వ‌చ్చా..? చ‌నిపోయిన వారి ఫొటోల‌ను పూజ గ‌దిలో దైవం ప‌క్క‌నే పెట్టి పూజించ‌వ‌చ్చా..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌నిపోయిన వారు జీవించి ఉన్న‌వారికి ఎంత‌టి ద‌గ్గ‌రి ఆత్మీయులైనా, ప్రేమ ఉన్న వారైనా స‌రే అసలు వారి ఫొటోల‌ను పూజ‌గ‌దిలో ఉంచరాదు. అందులోనూ దైవం ప‌క్క‌నే అస్స‌లు ఉంచ‌రాదు. వెంట‌నే తీసేయాలి. వాస్తు ప్రకారం అలా చ‌నిపోయిన వారి ఫొటోల‌ను దైవం ప‌క్క‌న పెట్ట‌డం దోష‌మ‌ట‌. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అన్ని అంశాల్లోనూ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. జీవిత‌మంతా క‌ష్టాలమ‌యం అవుతుంద‌ట‌.

ఇక దైవం ప‌క్క‌న చ‌నిపోయిన వారి ఫొటోల‌ను పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పేందుకు మ‌రో కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే… మ‌నిషి చ‌నిపోయినా అత‌ని ఆత్మ చావ‌దు క‌దా, త‌న‌కు ఆత్మీయులైన వారి చుట్టు ఎప్పుడూ అది ఉంటుంద‌ట‌. అలాంటిది ఆ వ్య‌క్తి ఫొటోను పెట్టి పూజిస్తే ఆత్మ‌ను పూజించిన‌ట్టే, అంటే దెయ్యాన్ని పూజించిన‌ట్టు అవుతుంద‌ట‌. దైవం, దెయ్యం రెండింటినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి పూజించరాదు. అది శాస్త్ర స‌మ్మ‌తం కాదు. అందుకే అలా చేయ‌కూడ‌దు.

పూజ గ‌దిలో చ‌నిపోయిన వారి ఫొటోల‌ను పెడితే ఆ ఇంట్లోని వారికి స‌మ‌స్యలు వ‌స్తాయ‌ని చెప్పాం క‌దా. వాటిలో ముఖ్యంగా ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మస్య‌లు ఉంటాయ‌ట‌. ఆరోగ్యం ఎవ‌రికీ బాగుండ‌ద‌ట‌.

పూజ గ‌దిలో అలా ఫొటోల‌ను పెడితే వారిపై దృష్టి మ‌ళ్లి దైవంపై దృష్టి నిల‌ప‌లేరు. దీంతో పూజ స‌రిగ్గా చేయ‌లేరు. అది దోష‌మ‌వుతుంది. అలాంటి పూజ ఫ‌లితాన్ని ఇవ్వ‌దు. క‌నుక పూజ‌గ‌దిలో ఎవ‌రైనా చ‌నిపోయిన త‌మ వారి ఫొటోల‌ను పెడితే వెంట‌నే తీసేయ‌డం మంచిది..!

Comments

comments

Share this post

scroll to top