స్మార్ట్‌ఫోన్లను ప్యాంట్ జేబుల్లో, వక్షాలకు తాకేలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్స్ నేడు మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అరచేతిలో ప్రపంచాన్ని చూపే హైస్పీడ్ ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్కింగ్, మ్యాప్స్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్… ఇలా ఎన్నో రకాలుగా స్మార్ట్‌ఫోన్స్‌ను మనం ఉపయోగిస్తున్నాం. అత్యంత చవక ధరలకే ఇవి మనకు ఇప్పుడు లభిస్తున్నాయి. అయితే వీటిని శరీరానికి అత్యంత దగ్గరగా పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. సెల్ టవర్ తరంగాలే కాదు, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఉత్పన్నమయ్యే పలు తరంగాలు కూడా మనకు హాని కలిగిస్తాయట. మగవారైతే వీటిని తమ ప్యాంట్ జేబులలో, కొంత మంది మహిళలు దీన్ని తమ వక్షాలకు తాకేలా పెట్టుకుని వెళ్తుంటారు. ఇలా ఆయా ప్రదేశాల్లో స్మార్ట్‌ఫోన్లను పెట్టడం ప్రమాదకరమట. ఈ క్రమంలో అలా స్మార్ట్‌ఫోన్లను పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

smart-phone-in-pocket

1. మహిళలు తమ వక్షాలకు తాకేలా ఫోన్లను పెట్టుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనికి తోడు ఇతర క్యాన్సర్లు కూడా వస్తాయట.

2. మగవారు తమ ప్యాంట్ జేబుల్లో ఫోన్లను పెట్టుకుంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా వీర్యం సరిగ్గా తయారు కాదట. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట.

3. కొంత మంది తమ ప్యాంట్ వెనుక జేబులో ఫోన్లను పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వెన్నెముక, పిరుదుల సంబంధ సమస్యలు వస్తాయట. నరాల బలహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ప్రధానంగా సయాటిక్ అనే ఓ నరం ఇబ్బందులకు గురవుతుందట.

smart-phone-in-chest

4. జేబుల్లో ఫోన్‌ను పెట్టుకుంటే దాని నుంచి విడుదలయ్యే హీట్ వల్ల ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుందట. దీని వల్ల మనకు సెకండ్ డిగ్రీ కాలిన గాయాలు అయ్యేందుకు అవకాశం ఉంటుందట.

5. ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మన శరీర మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుందట. ఇది మన మానసిక ఆరోగ్యంపై, మెదడుపై ప్రభావం చూపుతుందట.

6. ఫోన్ల వల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని పైన చెప్పాం కదా. ఈ క్రమంలో పలువురు ఫోన్ యూజర్లు డిప్రెషన్‌కు కూడా లోనవుతారట.

7. నిద్రలేమి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Comments

comments

Share this post

scroll to top