నిద్రించేట‌ప్పుడు ఓ కోడ్ని ప‌క్క‌న పెట్టుకుంటే దోమ‌లు కుట్ట‌వ‌ట‌.!?మ‌లేరియాకు చెక్.!!

దోమ‌లు కుట్ట‌కుండా ఉండేందుకు మ‌నం అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తాం క‌దా. కొంద‌రు ఆలౌట్ వంటివి పెట్టుకుంటే ఇంకొంద‌రు మ‌స్కిటో కాయిల్స్ వెలిగిస్తారు. ఇంకా కొంద‌రు ఇంట్లో పొగ వేస్తారు. ఈ మ‌ధ్య అయితే ఫ్లాష్ కార్డ్స్ వంటివి కూడా మార్కెట్‌లోకి వ‌చ్చాయి. ఇవే కాకుండా చాలా మంది దోమ తెర‌ల‌ను కూడా వాడుతారు. వీటికి ఆలౌట్‌లా క‌రెంట్ అవ‌స‌రం ఉండ‌దు క‌దా. వాస‌న కూడా కాదు. పూర్తిగా సుర‌క్షితం. క‌నుకే అధిక శాతం మంది దోమ తెర‌ల‌ను వాడుతారు. అయితే ఎవ‌రు ఏ ప‌ద్ధ‌తి ఉప‌యోగించినా దోమ‌లు కుట్ట‌కుండా ఉండ‌డానికే అవ‌న్నీ. కానీ ఇవి కాకుండా మీకు దోమ‌లు కుట్ట‌కుండా ఉండాలంటే ఇంకో ప‌ద్ధ‌తి కూడా ఉంది. అదేమిటంటే… మీరు ప‌డుకునేట‌ప్పుడు మీ ప‌క్క‌న ఓ కోడిని పెట్టుకోండి. అంతే… దోమ‌లు తోక ముడుస్తాయి. మీ ద‌గ్గ‌ర‌కు రాను కూడా రావు. షాకింగ్ ఉన్నా… సైంటిస్టుల ప‌రిశోధ‌నలో తేలిన నిజ‌మిది.

chicken-beside-sleep

స్వీడిష్ యూనివ‌ర్సిటీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్సెస్‌, ఇథియోపియాలోని అడిస్ అబాబా యూనివ‌ర్సిటీలకు చెందిన ప‌లువురు సైంటిస్టులు ఒక బృందంగా ఏర్ప‌డి దోమ‌లు వేటికి విక‌ర్షిత‌మ‌వుతాయో, వేటి నుంచి అవి దూరంగా పారిపోతాయోన‌న్న అంశంపై ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వారికి కోళ్లు దోమ‌ల‌కు శ‌త్రువులు అని తెలిసింది. సాధార‌ణంగా గేదెలు, ఆవులు, ఎద్దుల వంటి ప‌శువుల‌ను దోమ‌లు కుడ‌తాయి, కానీ దోమ‌లు కోళ్ల ద‌గ్గ‌రికి మాత్రం వెళ్ల‌వ‌ట‌. అయితే ఇదే విష‌యాన్ని వారు ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించాల‌నుకున్నారు. అందుకు వారు ఓ ప్ర‌యోగం కూడా చేశారు. అదేమిటంటే…

రెండు వేర్వేరు గ‌దుల్లో కొంత మంది వ్య‌క్తుల‌ను నిద్రించ‌మని సైంటిస్టులు చెప్పారు. దీంతో వారు అలాగే చేశారు. అయితే ఆ రెండు గ‌దుల్లో ఒక గ‌దిని అలాగే వ‌దిలేసి మ‌రో గ‌దిలో ఒక కోడిని పెట్టారు. దాన్ని ఓపెన్ టైప్‌లో ఉండే ఓ బాక్స్‌లో పెట్టి క‌ట్టేశారు. ఆ బాక్స్‌ను వ్య‌క్తులు ప‌డుకునే మంచానికి ద‌గ్గ‌ర‌గా ఉంచారు. ఈ క్ర‌మంలో కొన్ని గంట‌ల త‌రువాత తెలిసిందేమిటంటే… కోడి ఉన్న గ‌దిలోకి దోమ‌లు చాలా చాలా త‌క్కువగా వ‌చ్చాయ‌ట‌. అదే కోడి లేని గదిలోకి దోమ‌లు విపరీతంగా వ‌చ్చాయ‌ట‌. దీన్ని బ‌ట్టి ఆ సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే… కోడి నుంచి వ‌చ్చే ఓ ర‌క‌మైన వాస‌న దోమ‌ల‌ను త‌రిమేస్తుంద‌ని చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా నిద్రించే స‌మ‌యంలో ప‌క్క‌న కోడిని పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే అలా కోడిని పెట్టుకుంటే సాధార‌ణ దోమ‌లే కాదు, డెంగ్యూ, మ‌లేరియా దోమ‌లు కూడా మ‌న వైపు రావ‌ని స‌ద‌రు ప‌రిశోధ‌నకు నేతృత్వం వ‌హించిన ప్రొఫెస‌ర్ రిక‌ర్డ్ ఇగ్న‌ల్ చెబుతున్నారు. క‌నుక ఇక‌పై మీరు నిద్రించినా ఓ కోడిని ప‌క్క‌న పెట్టుకోండి. దాంతో దోమ‌ల బెడ‌ద ఉండ‌దు..!

Comments

comments

Share this post

scroll to top