ఒకప్పటి ఈ హీరోయిన్ దేనిపై కాలు పెట్టి ఫోటో కి స్టిల్ ఇచ్చిందో తెలుసా..? చూస్తే కోపం రావడం పక్కా..!

బాలివుడ్ నటి ట్వింకిల్‌ ఖన్నా తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.  తెలుగులో వెంకటేష్‌ సరసన ‘శీను’ సినిమాలో నటించింది ట్వింకిల్. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ట్వింకిల్‌ ఖన్నా, బాలీవుడ్‌ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్‌ని పెళ్ళాడిన విషయం  తెలిసిందే.పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టి ,ఇంటీరియర్ డిజైన్ వైపు అడుగులేసింది ట్వింకిల్.అంతేకాదు ఆమె రచయిత్రి కూడానండోయ్‌.ఒక భార్యగా,తల్లిగా,నటిగా,రచయిత్రిగా గుర్తింపు పొందిన ట్వింకిల్ ..తన ట్విటర్ లో  ఎప్పుడూ ఏదో ఒకటి పోస్టు చేస్తు అభిమానులకు దగ్గరగా ఉంటుంది..ట్వింకిల్ కి సంభందించిన ఒక ఫోటో ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికే కాదు,నెటిజన్లందరి ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తుంది..దాంతో ఆ ఫోటో చూసిన వారందరూ ట్వింకిల్ ని కడిగి పారేస్తున్నారు..ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే..

ఈ మధ్యనే ఓ ఫొటోసెషన్‌ కోసం పుస్తకాల్ని కిందేసుకుని కూర్చుంది ట్వింకిల్. ఆమె కాలికి అతి దగ్గర్లో (కాలి కింద, పక్కన) పుస్తకాలున్నాయి. అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పుస్తకాన్ని దైవంతో సమానంగా భావిస్తాం. ఎందుకంటే పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది .కాలికిందికి చిన్న పేపర్ వస్తేనే తీసి కళ్లకి అద్దుకంటాం.అలాంటిది దైవంలా భావించే పుస్తకాన్ని కాలికింది వేసుకుని కూర్చోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు దీనికి ట్వింకిల్ తలబిరుసు సమాధానం ఇచ్చింది..  ‘నేను కాలు పెట్టింది స్టూల్‌ పైన.. పుస్తకాల మీద కాదు.. పుస్తకాల మీద కూర్చున్నాను.. నిజమే, పుస్తకాల మీద పడుకుంటాను కూడా..’ అంటూ ..హానీ చెప్పింది. అంతే, ‘నీకు అసలు కళ్ళు కన్పిస్తున్నాయా.? కాళ్ళ కింద ఆ పుస్తకాలేంటి.?’ అంటూ మళ్ళీ నెటిజన్లు విమర్శలు షురూ చేసేశారు.

కొంతమంది వివాదాల కోసం తాపత్రయపడే క్రమంలో ఇదిగో ఇలాంటి ఫొటోలతో, విపరీత వ్యాఖ్యలతో హల్‌చల్‌ చేయడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌ అయిపోయింది. రచయిత్రి కూడా అన్పించుకున్న ట్వింకిల్‌ ఖన్నాకి ‘పుస్తకం విలువ’ తెలియదని ఎలా అనుకోగలం.?

Comments

comments

Share this post

scroll to top