మెగాస్టార్ 150 కోసం రాసుకున్న సినిమాకు రవితేజ హీరో..!?

‘ఆటో జానీ’ . ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గనుక 150వ చిత్రంగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో నటించి ఉంటే మనమంతా ఈ టైటిల్ గురించే మాట్లాడుకునే వాళ్ళం. చిరు 150వ చిత్ర దర్శకుడిగా పూరిజగన్నాథ్ ని ఓకె చేయడం, సెకండాఫ్ స్టొరీ నచ్చక ఆ సినిమాను పక్కనపెట్టేయడం, ప్రస్తుతం వి.వి. వినాయక్ డైరెక్షన్ లో ‘కత్తి’ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగాయి. అయితే తన కథ మీద తనకు నమ్మకం ఉన్న పూరి జగన్నాథ్, ఆటోజానీ కథను తాజాగా,మాస్ మహారాజా రవితేజకు వినిపించాడట. కాగా ఇందులో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఒక విధంగా చెప్పాలంటే రవితేజకు హీరోగా క్రేజ్ తెచ్చింది పూరిజగన్నాథే. అప్పటివరకూ మూసగా సాగిపోతున్న రవితేజకు ‘ఇడియట్’ మూవీతో సూపర్ హిట్ ని అందించాడు పూరి. ఇక ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో  ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘నేనింతే’, ‘దేవుడు చేసిన మనుషులు’  ఇలా అయిదు సినిమాలు తెరకెక్కి హిట్ కాంబినేషన్ గా నిరూపించుకున్నారు. అందుకే తన స్టొరీపై ఎంతో నమ్మకమున్న పూరి, ఈ కథను పక్కన పెట్టడానికి ఇష్టంలేక రవితేజతో ‘ ఆటోజానీ’ రూపొందించనున్నట్లు ఫిలింనగర్ టాక్.
raviteja-puri-jagannadh-ima
కాగా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చిరుతో 150 మిస్ అయినా 151, 152, .. ఇలా ఏదో ఒక సినిమా చేస్తానని పూరి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ రోగ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రవితేజ నూతన దర్శకుడు చక్రి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ‘ ఆటోజానీ’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి మరి.

Comments

comments

Share this post

scroll to top