డ్రగ్స్ కేసు: రాత్రి 8:30 కి ముగిసిన పూరీ విచారణ…ఏం చెప్పారో తెలుసా..? చార్మీకి బదులుగా శ్యామ్ ను విచారిస్తారు!

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ దందా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మొట్టమొదటి విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన పూరీని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, ఆయన అభిమానులు ఎక్సైజ్ కార్యాలయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడే ఉన్న మీడియాతో అభిమానులు మాట్లాడుతూ, ఈ కేసులో పూరీ జగన్నాథ్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైన ఈ విచారణ దాదాపు రాత్రి 8:30 గంటల వరకు కొనసాగింది.

కెల్విన్‌తో పూరికి పరిచయం పైనే సిట్ అధికారులు ప్రశ్నించారు. ఉస్మానియా ఉస్మానియా నార్కోటిక్ అధికారులు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని పూరి బ్లడ్ సాంపిల్ తీసుకున్నారు. అయితే పూరిని అరెస్టు చేయడం లేదని తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్. గురువారం (జులై 20) సినీ నటి ఛార్మీకి బదులుగా… సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడిని విచారించనున్నారు సిట్ అధికారులు.

డ్రగ్స్‌ మాఫియా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కెల్విన్‌తో తనకు పరిచయం ఉందని సిట్‌ విచారణ దర్శకుడు పూరి జగన్నాథ్‌ అంగీకరించారు. తన మిత్రుడి ద్వారా కెల్విన్‌తో తనకు పరిచయం ఏర్పడిందని… అతను పరిచయమైనప్పుడు డ్రగ్స్‌ సరఫరా చేస్తాడని తనకు తెలియదన్నారు. కొన్నాళ్ల తర్వాత అతడు డ్రగ్స్‌ సరఫరా చేస్తాడని తెలిసిందని, అప్పటి నుంచి అతనితో మాట్లాడటం తగ్గించినట్లుగా తెలిపారు. అయితే మొదటి రెండు గంటల్లో సిట్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు పూరి తడబడ్డాడు. డ్రగ్ సరఫరా నిందితుడు కెల్విన్‌తో కలిసి ఉన్న ఫోటోలను చూపించిన సిట్ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు షాకిచ్చారు. దీంతో నిజం చెప్పాడు.

సిట్‌ విచారణలో అధికారులు పూరీని ఏకధాటి ప్రశ్నలడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు. తరచూ బ్యాంకాక్‌ వెళ్లేది కథల కోసమేనని… డ్రగ్స్‌ కోసం కాదని సిట్‌ అధికారులకు పూరి తెలిపారు. తనకు పబ్‌లకు వెళ్లే అలవాటుంది కానీ డ్రగగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. సినీ ప్రపంచంలో స్నేహితులు మినహాయించి బయట పెద్దగా తనకు స్నేహితులు లేరని తెలిపాడు. విచారణలో అధికారులు పూరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కెల్విన్‍‌తో పరిచయం గురించి పూరీ జగన్నాథ్ వెల్లడించారు. అయితే, అంతకుముందు అతను ఎవరో తెలియదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు ఆధారాలు ముందు పెట్టారని తెలుస్తోంది.

మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకూ జరిగిన విచారణలో సిట్‌ పూరీకి కెల్విన్‌తో దిగిన ఫోటోలు చూపించారు. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్‌లో కెల్విన్‌, జీషన్‌ ఉన్నారని, కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపించినట్లుగా ఉన్న ఆధారాలను సిట్‌ అధికారులు పూరీకి చూపించి ప్రశ్నించారు. ఆ ఆడియో ఫంక్షన్‌ ఈవెంట్‌ కోసమే కెల్విన్‌ డబ్బులు పంపినట్లుగా పూరి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కెల్విన్, జీషన్‌లు పబ్బులో రెండుసార్లు కలిసినట్లు పూరి చెప్పారని…అయితే వారితో రెగ్యులర్ గా మాట్లాడలేదని చెప్పినట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top