పూరి జగన్నాధ్ “రోగ్” చిత్రం హిట్టా? ఫట్టా?… స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Movie Title (చిత్రం): రోగ్ (Rogue)

Cast & Crew:

 • నటీనటులు: ఇషాన్, మన్నారు చోప్రా, ఆంజెలా, ఠాకూర్ అనూప్ సింగ్, ఆలీ, తులసి, సుబ్బరాజు తదితరులు
 • సంగీతం: సునీల్ కశ్యప్
 • నిర్మాత: సి. ఆర్ . మనోహర్ (తన్వి ఫిలిమ్స్ )
 • రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

Story:

ఒక మధ్య తరగతి కుటుంబం కి చెందిన కుర్రాడు “చంటి” (ఇషాన్). రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అనుకోకుండా అతనికి ఒక అమ్మాయి (మన్నారు చోప్రా) పరిచయం అవుతుంది. “ఇషాన్” తన కథను ఆ అమ్మాయికి చెప్తాడు. ఇషాన్ కథావిని ఆ అమ్మాయి అతనితో ప్రేమలో పడిపోతుంది. కానీ “ఇషాన్” మాత్రం ప్రేమకు, అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. ఇంతలో “మన్నరా చోప్రా” పై దాడి జరుగుతుంది. ఆ అమ్మాయిని కాపాడటం కోసం తనని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడు ఇషాన్. అసలు ఆ అమ్మాయిపై దాడి చేసింది ఎవరు? మన్నరను ఇషాన్ ప్రేమిస్తాడా? ఇవన్నీ తెలియాలి అంటే “రోగ్” సినిమా చూడాల్సిందే!

Review:

“తెంపెర్, ఇజం” హిట్ కొట్టి “పూరి జగన్నాధ్” మంచి స్పీడ్ లో ఉన్నారు. “హార్ట్ ఎటాక్” తరవాత పూరి తీసిన లవ్, రొమాంటిక్ సినిమా ఇదే. రొమాన్స్ ఈ సినిమాలో చాలా ఎక్కువైందని చెప్పాలి. ఇక పూరి అనగానే గుర్తొచ్చే పంచ్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు “ఇషాన్”. మన్నరా గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేకం. మొత్తానికి ఇది పూరి బ్రాండ్ సినిమా అని చెప్పొచ్చు!

Plus Points:

 • ఇషాన్ డైలాగ్ డెలివరీ, ఆక్షన్ సీన్స్.
 • మన్నరా గ్లామర్
 • పూరి జగన్నాధ్ డైలాగ్స్
 • బాక్గ్రౌండ్ మ్యూజిక్
 • సాంగ్ విసుఅల్స్

Minus Points:

 • రొటీన్ స్టోరీ
 • నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్దో ఈజీ గా చెప్పేయొచ్చు

Final Verdict:

పూరి డైలాగ్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సినిమా చూసిన తరవాత ఈ సినిమాకి ఎందుకు వచ్చామురా అని మాత్రం అనుకోము. రొమాన్స్, కామెడీ, ఆక్షన్, లవ్, సెంటిమెంట్..ఇలా అన్ని కోణాలను తగిన మోతాదులో ఈ సినిమాలో చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే “రోగ్” సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top