డ్రగ్స్ కేసులో “పూరి జగన్నాధ్” స్పందించి ఆ నలుగురి పేర్లు బయటపెట్టారంట..? ట్విట్టర్ లో స్పందించి..ఇంతలో తన కూతురు!

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ “డ్రగ్స్ వివాదం”. కొంతమంది ప్రముఖల పేర్లను కొన్ని మీడియా చానెల్స్ బయటపెట్టాయి. అందులో సంచలన దర్శకుడు “పూరి జగన్నాధ్” పేరు కూడా ఉంది. ఈ వార్తపై పూరీ జగన్నాథ్ స్పందించాడు అని. ఫేస్ బుక్ లో పోస్టులతో కలకలం రేపాడు అని సోషల్ మీడియాలో కొంత మంది రాసారు. వారి సారాంశం ప్రకారం.

“ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందికి నోటీసులు అందాయి.. మిగతా ప్రముఖుల గురించి ఎక్కడా రాలేదు. తనపై మీడియాలో లోఫర్, ఇడియట్ అంటూ చాలానే రాశారు. తాను చెప్పే ముగ్గురు ప్రముఖుల పేర్లను రాసే దమ్ము మీకు ఉందా అంటూ మీడియాను ప్రశ్నించాడు. ఈ కేసులో తనతోపాటు అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ, దగ్గుబాటి సురేష్ చిన్న తనయుడు అభిరామ్ తో పాటు, మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కూడా ఉన్నాడని తన పోస్టులో పేర్కొన్నాడు. వందల కోట్లు సంపాదించి, రోడ్డుపైకి వచ్చిన తాను, విషమ పరిస్థితిలో డ్రగ్స్ తీసుకునేవాడిని, ఇప్పుడు దాని నుంచి బయటపడిన విషయం మీకు తెలుసా అంటూ వ్యాఖ్యానించాడు. అయితే టాలీవుడ్ లో పూరీ స్టేట్ మెంట్ పెద్ద కలకలమే సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో మిన్నుకుండటం వలనే తనపై ఇష్టానుసారంగా మీడియాలో రాసుకున్నారని ఆవేదనతో ఉన్నానని చెప్పుకొచ్చాడు”. ఈ కింద ఫోటో కూడా పెట్టారు.

కానీ ట్విట్టర్ లో మాత్రం పూరి వేరేలా ట్వీట్ చేసారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో తాను ఇప్పటి వరకూ ఎవరితోనూ మట్లాడలేదు, నన్ను ఎవరూ సంప్రదించలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నట్టు తాను ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. తాను ప్రస్తుతం ‘పైసా వసూల్’ మూవీ షూటింగ్‌ బిజీగా ఉన్నానన్నారు. ఆ ట్వీట్ మీరే చూడండి!

ఇంతలో అతని కూతురు కూడా ఇంస్టాగ్రామ్ లో తన తండ్రికి ఏం సంబంధం లేదు అని చెప్పారు.

 

Comments

comments

Share this post

scroll to top