తండ్రి దర్శకత్వంలో కొడుకు నటించిన “మెహబూబా” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం):

Cast & Crew:

నటీనటులు: ఆకాష్ పూరీ,నేహా శెట్టి,విష్ణు రెడ్డి,షిండే త‌దిత‌రులు
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
సంగీతం: సందీప్ చౌతా
నిర్మాత: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌

Story:

చిన్ననాటి నుండి ఎంతో డిసిప్లేన్ గా పెరిగిన రోషన్ బోడర్ లో సైనికుడిగా ఉండాలని అనుకుంటాడు. ఇక ఈ తరుణంలో లాహోర్ నుండి అఫ్రీన్ స్టడీస్ కోసం ఇండియా వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడిన రోషన్ ఆమె ప్రేమని దక్కించుకోవాలని అనుకుంటాడు. ఈలోగా ఇండియా పాకిస్థాన్ యుద్ధం వస్తుంది. ఇంతకీ రోషన్, అఫ్రీన్ ల ప్రేమ ఫలించిందా..? వారు ప్రేమ కేవలం ఒకతరానిదేనా..? అన్నది తెర మీద చూడాల్సిందే.

Review:

రోషన్ పాత్రలో ఆకాష్ పూరి అదరగొట్టాడు. గట్స్ ఉన్న కుర్రాడిగా సైనికుడిగా ఎంతో కాన్ ఫిడెంట్ గా సినిమా చేశాడు. ఇక నేహా శెట్టి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమా అంతా ఎక్కువ శాతం లీడ్ పెయిర్ మీదే నడుస్తుంది. పూరి మాత్రం ఇద్దరిని కరెక్ట్ గా సెట్ చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. సందీప్ చౌతా మ్యూజిక్ బాగుంది. సినిమా కథకు తగినట్టుగా ట్రెండీ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడ్డాయి. కొన్ని సిజి షాట్స్ ఉన్నా కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఒకే. కథ, కథనాల్లో పూరి కొత్తదనం చూపించాడు. పూరి టేకింగ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి.ఇండో పాక్ యుద్ధం నేపథ్యంతో ఓ ప్రేమ జంట పడిన కష్టాలే మెహబూబా సినిమా.

సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో ఉంటుంది. అయితే సినిమా అంతా పూరి అద్భుతమైన టేకింగ్ తో తెరకెక్కించాడు. ఆకాష్ పూరి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మాక్సిమం రియల్ లొకేషన్స్ లో సినిమా చేశారు. బోర్డర్ లో పరిస్థితులను చూపించారు. అయితే ఎంటర్టైనింగ్ గా సినిమా చెప్పడంలో కొద్దిగా వెనుకపడ్డాడు పూరి. ఇదవరకు తన సినిమాల్లో ఓ పక్క కథ చెబుతూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్ ఉండేది. కాని మెహబూబాలో అది మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మాములుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్పింగ్ గా ఉంటుంది.క్లైమాక్స్ మాత్రం అంచనాలను అందుకోలేదు. ఓవరాల్ గా పూరి చేసిన ఓ మంచి ప్రయత్నం మెహబూబా. అయితే అంచనాలను అందుకునేలా మాత్రం లేదని చెప్పాలి.

Plus Points:

లీడ్ పెయిర్

మ్యూజిక్

టేకింగ్

Minus Points:

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

అక్కడక్కడ ల్యాగ్ అవడం

Final Verdict:

మెహబూబా.. పూరి మార్క్ మూవీ..!

Rating: 2.75 / 5

Comments

comments

Share this post

scroll to top