వాట్సాప్ లో ఊబర్ క్యాబ్ డ్రైవ‌ర్ మెసేజ్‌లు.. అతనికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే..?

నేడు మ‌న దేశంలో మ‌హిళల భద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మైంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక సంద‌ర్భంలో మ‌హిళ‌లు వేధింపుల‌కు, దాడుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. క‌ఠిన‌త‌రమైన చ‌ట్టాలు ఉన్నాయ‌ని చెప్పుకుంటున్నా అవి ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌డం లేదు. ఈ మ‌ధ్య కాలంలో అయితే ఇలాంటి సంఘ‌ట‌నలు ఎక్కువ‌వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు క్యాబ్‌ల‌లో వెళితే వేధించే డ్రైవర్లే ఎక్కువగా ఉంటున్నారు. పూణెలో కూడా ఇటీవ‌లే ఓ మ‌హిళ‌కు క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అయితే ఆమె చూస్తూ ఊరుకోలేదు..! ఏం చేసిందంటే…

ఆమె పేరు అంబికా శ‌ర్మ అన‌వ్‌క‌ర్‌. పూణెలో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమె అక్క‌డే స్థానికంగా ఉండే ప‌ష‌న్ అనే ప్లేస్‌కు ఊబ‌ర్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకుంది. దీంతో సంజ‌య్ అనే పేరున్న ఓ క్యాబ్ డ్రైవర్ వ‌చ్చాడు. ఆమెను పిక‌ప్ చేసుకుని గ‌మ్య‌స్థానంలో సేఫ్‌గానే దింపాడు. అయితే పిక‌ప్ చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఆమె దిగిపోయే వ‌ర‌కు ఆమెతో ఆ డ్రైవ‌ర్ ఏదో ఒక‌టి మాట్లాడుతూనే ఉన్నాడు. మీ పేరేంటి..? ఏం చేస్తారు..? ఎక్క‌డుంటారు..? తో మొద‌లైన ఆ ప్ర‌శ్న‌లు అంత‌టితో ఆగ‌లేదు. అవి ఎక్క‌డికో వెళ్లాయి. అన్నీ ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి చెందిన ప్ర‌శ్న‌ల‌నే అత‌ను అడిగాడు. అయితే మొద‌ట ఒక‌టి రెండు ప్ర‌శ్న‌ల‌కు క్యాజువ‌ల్ గానే ఆమె స‌మాధానం చెప్పింది. కానీ ఆ త‌రువాత అత‌ను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే గ‌మ్య‌స్థానం రావ‌డం, ఆమె దిగి పోవ‌డం జ‌రిగింది. అయితే అద అంత‌టితో ఆగ‌లేదు.

క్యాబ్ బుక్ చేసుకున్న సంద‌ర్భంగా అంబిక ఫోన్ నంబ‌ర్ ఊబ‌ర్ యాప్‌లో సంజ‌య్‌కు తెలుస్తుంది క‌దా, దాన్ని అత‌ను సేవ్ చేసుకున్నాడు. ఇక అప్ప‌టి నుంచి ఆమె నంబ‌ర్‌కు వాట్సాప్‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్టు మెసేజ్‌లు పంప‌సాగాడు. దీంతో విసుగెత్తిపోయిన అంబిక ఓ స‌మ‌యంలో ఊబ‌ర్ సంస్థ‌కు, స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఊబ‌ర్ అత‌న్ని త‌మ పార్ట్‌న‌ర్‌గా తొల‌గించింది. పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ క్యాబ్‌ల‌లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఉందా..? అంటే అందుకు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మే లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక క్యాబ్‌ల‌ను న‌డిపే సంస్థ‌లు లేదా పోలీసులు, ప్ర‌భుత్వాలు వారి కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top