పూనమ్ కౌర్ ఆత్మహత్యాయత్నం వెనుక నిజాలు ఇవేనట. వివాదంలోకి త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియా,మీడియా అంతా అజ్ణాతవాసి న్యూస్ తో నిండిపోయింది..సరే సినిమా ఎలా ఉంది అనేది తర్వాత విషయం..అయితే మళ్లీ పాత న్యూస్ కి వెళ్దాం కత్తి మహేశ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ …వార్ మధ్యలోకి పూనమ్ కౌర్ వచ్చింది..ఫ్యాట్యూ అంటూ మహేశ్ ని వెక్కిరింతగా మాట్లాడ్డాం..కత్తి దానికి ఘాటుగా సమాధానం చెప్పడం జరిగిపోయాయి..ఆ తర్వాత కత్తి అడిగిన ఆరు ప్రశ్నలు కూడా బాగా పాపులర్ అయ్యాయ్ .. అయితే ఇప్పుడు ఆ ఆరు ప్రశ్నలకు సంభందించిన ఒక అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటో తెలుసా..అది తెలియాలంటే ముందు కత్తి అడిగిన ఆరు ప్రశ్నలు తెలియాలి గా..

పూనమ్‌కు పదవి ఎలా వచ్చింది? గోత్ర నామాలతో పవన్‌తో కలిసి పూనమ్ కౌర్ పూజలు? పూనమ్ ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది? ఆ హాస్పటల్ బిల్స్ ఎవరు కట్టారు..త్రివిక్రమ్ అంటే పూనమ్ కి ఎందుకు కోపం..ఈ విధంగా కత్తి అడిగిన ప్రశ్నలకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ఏంటంటే..

అవి జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు .. కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది . అపుడే ప్రేక్షకాదరణ పొందుతున్న పూనమ్‌కు జల్సా ఆఫర్ చాలా పెద్దది. ఆ సమయంలో జల్సా ఆఫర్ వచ్చినందుకు డేట్స్ లేకపోయినా మిగితా అవకాశాలు వదులుకని జల్సాను ఒప్పుకొన్నది.జల్సా సినిమా సందర్భంగా జరిగిన పూజలలో పూనమ్ కౌర్ ఉండటానికి అదే కారణం ….

ఆ తర్వాత త్రివిక్రమ్ జల్సా సినిమా నుంచి ఆమెను తప్పించి కమిలిని ముఖర్జీని తీసుకున్నారు.జల్సా సినిమా నుంచి తప్పించడం కారణంగా పూనమ్ కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. దాంతో అప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తన కోపాన్ని పెంచుకొన్నట్టు సమాచారం.

జల్సా సినిమా నుంచి తనను తప్పించడంపై మనస్తాపం చెందిన పూనమ్ కౌర్ ఆత్మాహత్యాయత్నం చేసినట్టు సమాచారం. పూనమ్ కౌర్ సూసైడ్ విషయం తెలుసుకొన్న పవన్ కల్యాణ్ ఆమెను పరామర్శించినట్టు తాజా పోస్ట్ సారాంశం.జల్సా నుంచి తప్పించడం వెనుక ప్రత్యక్షంగా పూర్తి కారణం ఏమీలేకపోయినా పూనమ్‌ ఓదార్చి హాస్పిటల్ బిల్ కూడా పవన్ కట్టినట్టు పోస్టులో పేర్కొన్నారు. అప్పుడే పూనమ్‌ను ఉన్నత స్థితికి చేర్చుతానని ఆమె తల్లికి కూడా మాట ఇచ్చారట.

ఆ క్రమంలోనే ఏపీ రాష్ట చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవికి తనే సిఫారసు చేసినట్టు పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను కత్తి మహేష్ తన అస్త్రాలుగా చేసుకోవడం తెలిసిందే.

కత్తి మహేష్ వేసిన ప్రశ్నలకు పూనమ్ కౌర్ స్పందించవచ్చు లేదా స్పందించకపోవచ్చు. కానీ రేపు మరొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు , చెప్పాలా ?ఇపుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పా ?ఆయనను గౌరవించకుండా ఎలా ఉండ మంటారు ..నిజం అందరికి తెలియాలి అని పవన్ అభిమానులు ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు.

Comments

comments

Share this post

scroll to top