“అమ్మాయిల్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్”.! పూనమ్ కౌర్ పోస్ట్ కి “పవన్ కళ్యాణ్” పై కామెంట్స్..?

జనసేన ఆవిర్భావ మహాసభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం  పొలిటికల్ సర్కిల్‌లో హీట్ పెంచిన విషయం తెలిసిందే.ఇంతకుముందు ఈ జోరు లేదని విమర్శించినవారు ఇప్పుడు పవన్ ని ప్రశంసిస్తుంటే,రాజకీయపరంగా మాత్రం  పవన్ కళ్యాణ్‌ మీద విమర్శల జోరు పెరిగింది.  అధికార టీడీపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడి పడుతూ డైరెక్ట్ ఎటాక్‌కి దిగింది.. మరొవైపు ప్రముఖ  నటి పూనం కౌర్ ఇన్‌డైరెక్ట్ ఎటాక్ స్టార్ట్ చేసింది..
గతంలో కత్తిమహేశ్ పవన్ని విమర్శిస్తున్నప్పుడు పూనమ్ కత్తికి యాంటీగా కామెంట్ చేసింది..కత్తి మహేష్‌ను ఫ్యాట్సో, బిచ్చగాడి కంటే కత్తి మహేష్‌ పరిస్థితి దారుణం ట్వీట్ చేసి అప్పట్లో వివాదాన్ని మరింత రాజేసింది పూనమ్. ఇక కత్తి మహేష్ కూడా ఓ రేంజ్‌లో పూనమ్‌పై విమర్శలు గుప్పిస్తూ బహిరంగ సవాల్ విసిరారు.పూనమ్ మధ్య రహస్య సంబంధం ఉందంటూ బాంబ్ పేల్చారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ‘ఎలాంటి బంధుత్వం లేకుండా ఒక మహిళకు సహాయపడితే, అది ఏదో చెప్పకూడని బంధం ఉన్నట్లుగానే భావించాలా? ఎదగండి బాబు’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా పూనమ్ చేసిన పోస్ట్… కత్తి మహేష్‌కు కౌంటర్ ఇచ్చేదిగా ఉన్నప్పటికీ.. పూనంకు పవన్ కళ్యాణ్ సహాయపడిన అంశం తేటతెల్లమైంది. ఈ వివాదం వ్యక్తిగత విమర్శలకు దారితీయడంతో తనకు బాసటగా ఉండాలంటూ పూనం కౌర్.. పవన్ కళ్యాణ్‌ను కోరుతూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపట్లోనే డిలీట్ చేసింది పూనమ్..ఇప్పుడు పవన్ ని వ్యతిరేకిస్తూ పోస్టు పెట్టింది ఇదే పూనమ్ కౌర్..
 ఒకవైపు పవన్ కళ్యాణ్ తాజా కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చనడుస్తుంటుంటే ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్ట్‌ను పెట్టి తెరపైకి వచ్చింది పూనమ్ కౌర్. ‘కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, జనాలు ఇన్నోసెన్స్‌తో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ భగవంతుడే నిజం ఏంటో అని అందరి కళ్లు తెరిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది పూనమ్. అయితే ఇందులో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాలేకపోయినా.. ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించే అంటూ ఆమె తరపు వర్గం, పవన్ వ్యతిరేక వర్గం ప్రచారం మొదలు పెట్టింది.

Comments

comments

Share this post

scroll to top