పులి చర్మంపై ఉన్న చారల వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?

పులి..మన జాతీయ జంతువు. సింహం తర్వాత అడవికి పెద్ద దిక్కు అదే. అంతేకాదు….అడవి జంతువులలో పులికి ఓ విశిష్టత ఉంది అందేంటో తెలుసా? పులి చర్మం మీదున్న గీతలు… అదెలాగో తెలుసా? ప్రతి మనిషికి వేర్వేరు వేలి ముద్రలున్నట్టు…ప్రతి పులికి  చర్మం మీద వేర్వేరు చారలు/గీతలుంటాయట.!  కలర్ విషయంలో, వాటి సైజ్ విషయంలో, స్టైల్ విషయంలో ఈ మార్పులుంటాయట….మనిషి వేలిముద్రలలాగే ఏ రెండు పులుల గీతలు సమానంగా ఉండకపోవడం విశేషం.

tiger

చారల వల్ల ఉపయోగం:

సృష్టిలోని ప్రతిజీవికి  ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పులికి తన చర్మం మీదున్న చారలన్నమాట…ఇవి పులి వేటాడడానికి చాలా ఉపయోగపడతాయి. అదెలాగంటే… పులి చర్మం మీదున్న గీతలు ఎక్కువగా ఆరెంజ్, బ్లాక్, వైట్ కలర్ లో ఉంటాయి. అడవిలోని చాలా జంతువులు బ్లాక్ కలర్ ను గుర్తించలేవు….సో పులి అలాంటి జంతువులపై ఊజీగా దాడి చేసుస్తుందన్నమాట….అంతే కాదు ఆరెంజ్ కలర్ ప్రకృతిలో కలిసిపోయి ఉంటుంది…దీని కారణంగా కొన్ని జంతువులు ఎదురుగా ఉన్నది పులి అని కనిపెట్టలేవు. ఇది కూడా పులి వేటకు సహకరిస్తుందన్నమాట.

సింపుల్ గా చెప్పాలంటే…అడవిలో కూబింగ్ చేసే పోలీసులు వేసుకునే డ్రెస్ శత్రువులపై ఎటాక్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ? పులులకు కూడా తమ చర్మంమీదున్న ఆ గీతలు అలా ఉపయోగపడతాయన్నమాట.

Comments

comments

Share this post

scroll to top