అమ్మాయిల శరీర భాగాల గురించి ఆ లెక్చరర్ నీచమైన వ్యాఖ్యలు.! పుచ్చకాయ పండిందో లేదో తెలుసుకోవాలంటే.?

కేరళలో ఓ లెక్చలర్  విద్యార్థినుల శరీర భాగాలను వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు నిరసనగా కేరళ రాష్ట్రంలో వాటర్ మిలన్ ఉద్యమం జరుగుతుంది. అన్నివర్గాల నుంచి ఈ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రం కొజికోడ్‌ లోని ఫరూక్‌ ట్రైనింగ్‌ కాలేజీలో లెక్చలర్ గా పనిచేస్తున్నారు జౌహర్‌ మునవీర్‌. ఇటీవల ఒక ప్రైవేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. మా కాలేజీలో 80 శాతం మంది అమ్మాయిలే. అందరూ లెగ్గిన్స్ ధరిస్తారు. శరీర భాగాల్నికప్పుకునేందుకు ముస్లింలు స్కార్ఫ్‌ ధరిస్తారు. చాలా మంది అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నారు. అలా చేయడం వల్ల.. మగవారు ఆకర్షితులవుతారు. వాటర్‌ మిలన్‌ పండిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతుంది…. అంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి జౌహర్‌ మునవీర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అసలు అలా ప్రవర్తించడం ఇస్లాంకు విరుద్ధం అంటూ వివాదానికి తెర తీశాడు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, విద్యార్థి సంఘాలు వాటర్ మిలన్‌ ఉద్యమం చేపట్టారు.


కొన్ని జిల్లాలకు చెందిన అమ్మాయిలైతే ఏకంగా ఫేస్ బుక్ లో నగ్న ఫోటోలు పెట్టి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు పెట్టి నిరసన తెలుపుతున్న వారిలో తిరువనంతపురానికి చెందిన ఆర్తీ అనే 25 ఏళ్ల వివాహిత ఉన్నారు. ఆర్తీ భర్త కూడా ఆమె ఫొటోలను షేర్ చేశాడు. దీనిపై ఆర్తీ మాట్లాడుతూ.. అమ్మాయిల గురించి కొంత మంది చేసిన వ్యాఖ్యలతో అప్ సెట్ అయ్యాను అన్నారు. ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిల శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్‌మిలన్‌ ఉద్యమం చేస్తోంది. ఆర్తీ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. కేరళలోని యువతులు పుచ్చకాయలతో తమ నిరసన తెలుపుతున్నారు.

ఈ వివాదంపై ఫారూఖ్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. కాలేజీ బయట చేసిన వ్యాఖ్యలతో కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని కూడా స్పష్టం చేశారు. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు..

Comments

comments

Share this post

scroll to top