పబ్జీ గేమ్ ని త్వరలోనే బ్యాన్ చేయనున్నార.? బ్యాన్ చెయ్యాలని ఒత్తిడి తెస్తున్న పేరెంట్స్..!!

పబ్జీ గేమ్.. ఈ గేమ్ గురుంచి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు, మొన్న నరేంద్ర మోడీ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు, అందులో ఒక అమ్మ తన బిడ్డ ఒక ఆన్ లైన్ గేమ్ కి బానిస అయ్యాడని, అతనికి ఎన్ని సార్లు చెప్పినా అతను గేమ్ ఆడటం ఆపట్లేదని, ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని మోడీ గారిని అడిగారు ఆమె, ఆమె ప్రశ్నకు బదులిస్తూ, మీ వాడు పబ్జీ వాడు కదా అని చమత్కారం గా సమాధానమిచ్చాడు. అంటే మీ పిల్లోడు ఆడే గేమ్ పబ్జీ ఏ గా అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు, ఆయన ఆ మాట చెప్పినప్పటి నుండి చాలా మంది పబ్జీ ని బ్యాన్ చెయ్యాలని కోరుతున్నారు.

కాలేజెస్ లో.. :

కొన్ని కాలేజీ లలో పబ్జీ ఆడటాన్ని నిషేదించారు, కాలేజీ లు మాని మరి పిల్లొలు రూమ్ లలో కూర్చొని ఆడుతా ఉన్నారు. పబ్జీ వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తుంది, గడిచిన 4 నెలల నుండి దీని ప్రభావం స్టూడెంట్స్ పైన ఎక్కువ పడింది, ఆఖరికి 6th క్లాస్ పిల్లొలు కూడా పబ్జీ పబ్జీ అని ఎగబడి ఆడుతున్నారు, పెద్దవాళ్ళు ఏమి తక్కువ కాదు, వారు కూడా పబ్జీ ఆటకు బానిసలు అయిన వారే, ఎప్పటికప్పుడు పబ్జీ గేమ్ లో ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది, అందుకే దానికి అంతలా అడిక్ట్ అయ్యారు జనాలు, దాని నుంచి అంత తొందరగా విముక్తి పొందలేకపోతున్నారు..

గ్రూప్ ఏ కారణం, ప్రాణాలు కూడా తీస్తున్నారు.. :

గ్రూప్ లో నలుగురుంటే చాలు, చలో పబ్జీ అంటారు. బ్యాచ్ బ్యాచ్ పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు, కానీ కేవలం కాలక్షేపం కె కాదు, పని మానుకొని మరి ఆడుతున్నారు ఈ గేమ్ ని. పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ లో ఉన్న తన ఫ్రెండ్ తనకి సహాయం చెయ్యలేదని తనని చంపేశాడు ఒక ఘనుడు, ఇంట్లో వాళ్ళు పబ్జీ గేమ్ ఆడుకోనివ్వట్లేదని ఇంట్లో వాళ్ళని చంపేశాడు ఇంకొకడు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, పబ్జీ గేమ్ వల్ల చాలా ఘోరమైన సంఘటనలు జరిగాయి.

గవర్నమెంట్ పైన పేరెంట్స్ ఒత్తిడి.. :

పబ్జీ గేమ్ ని బ్యాన్ చెయ్యాలని పేరెంట్స్ చెబుతున్నారు, చదువులు మానేసి మరి ఈ గేమ్ కి బానిసలు అయ్యారు, మేము ఎంత చెప్పినా వినకుండా అలాగే ఆడుతున్నారు, వీలైనంత త్వరలో పబ్జీ గేమ్ ని ఇండియా లో బ్యాన్ చెయ్యండి అని గవర్నమెంట్ ని వేడుకుంటున్నారు.

కంట్రోల్ లో పెట్టాలి.. :

రాత్రి 3 4 వరకు కూడా పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటారు పిల్లలు, మరి కొందరు అయితే ఉదయం 6 వరకు కూడా ఆడుతుంటారు, అంతలా అడిక్ట్ అయ్యారు ఈ గేమ్ కి, కాలక్షేపం కోసం ఆడటం వరకు మంచిది, కానీ పనులు మానుకొని క్లాస్ లు ఎగ్గొట్టి మరి ఆడితేనే ఇబ్బంది, మోడీ దృష్టికి వెళ్లడం తో త్వరలోనే పబ్జీ ని బ్యాన్ చేసే అవకాశం ఉందని చాలా మంది గట్టిగా చెబుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top