నిన్నటి దాకా ‘ సైకో సూది గాడు’ హల్ చల్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో బాణాల సైకో హల్ చల్ చేశాడు. చింతూరు మండలం వేగితోటలో ముత్తయ్య అనే సైకో వీరంగం సృష్టించాడు. జనాలపై బాణాలు వేసి దాడి చేశాడు. సైకో దాడిలో దారయ్య, లాలమ్మ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు సైకో ముత్తయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Watch Video: