నాగబాబు పై పృద్వి సంచలన కామెంట్స్!!

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాజకీయ
పార్టీలంతా తమ తమ గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టాయి. దింతో నాయకులంతా తమ నోటికి పని చెప్పుతున్నారు. కమెడియన్
పృధ్వీ జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకొని పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో నాగబాబుపై పృధ్వీ కొన్ని
కామెంట్లు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నాగబాబు పృధ్వీపై ఫైర్ అయ్యారు.

ఏం జరిగిందంటే….పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ప్రజలు, వివిధ వర్గాల వారు విరాళాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో
నాగబాబు కూడా వరుణ్ తేజ్ తో కలిసి రూ.1.25 కోట్లు విరాళం అందించారు. అయితే ఆ డబ్బు నాగబాబుది కాదని…అది ప్యాకేజీ
రూపంలో వచ్చిన డబ్బని, దాన్నే నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారని నటుడు పృధ్వీ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు
వచ్చాయి. ఈ ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో నాగబాబు సిరీయస్ అయ్యారు. అరేయ్ పృధ్వీ నువ్ నాకు ఫోన్ చెయ్.. నేను నీకే
సమాధానం చెబుతా’ అంటూ పృధ్వీపై విరుచుకుపడ్డాడు.

నాగబాబు చేసిన కామెంట్లపై పృధ్వీ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. నాగబాబు అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారో తనకి
తెలియడం లేదన్నారు. రాత్రి టీవీ చూసి తను షాక్ అయినట్లు పృధ్వీ చెప్పారు. అసలు తనకు ఈ విషయంతో సంబంధమే లేదని
అయినా కూడా లేని వివాదంలో తనను లాగుతున్నారని అన్నారు పృధ్వీ.

నాగబాబు తనకి ఫోన్ చేయమని చెప్పారు కాబట్టి ఫోన్ చేసానని.. అలాంటి ఆరోపణలు నేను మీ పై ఎందుకు చేస్తానని..అయినా అసలు
నేను మిమ్మల్ని విమర్శంచే అంతటి వాడినా అని అడిగానన్నారు. దీనిపై నాగబాబు కూడా సానుకూలంగా స్పందించారని..అక్కడితే
వివాదం సమసిపోయిందని అన్నారు.

Comments

comments

Share this post

scroll to top