బాహుబలిని అడ్డుకుంటాం…!

ఇప్పటి వరకు పాజిటివ్ ప్రచారంతో దూసుకుపోతున్న బాహుబలికి ఇప్పడు నెగెటివ్ షాక్ తగులుతుంది. విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు బాహుబలిని విమర్శలు ముంచెత్తుతున్నాయి.

mala jac protest against bahubali

తాజాగా  ఈ సినిమాపై  ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మాల కులస్తులను అవమాన పరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేసారు. సినిమాలో ఆ సీన్లను వెంటనే తొలగించక పోతే  బాహుబలి  సినిమాను అడ్డుకుంటామని దీపక్ కుమార్ హెచ్చరించారు.

reporters with rajamouli

మాలలను కించపరుస్తూ ప్రసారమైన వీడియో క్లిప్పింగులను యూట్యూబ్ ద్వారా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దీపక్ కుమార్ తెలిపారు. మరో వైపు  మీడియా కూడా బాహుబలి విజయంలో గుర్రుగా ఉంది. నిన్న దీనికి సంబంధించి ఏకంగా జక్కన్న దగ్గరే ఫైర్ అయ్యారు విలేకరులు.  ప్రమోషన్ లో తమను పక్కనపెట్టి  కేవలం ప్రచారానికి  మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారని వారు మండిపడ్డారు.

CLICK: బాహుబలి బ్లాక్ టికెట్ల దందా షురూ!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top