ప్రామిస‌రీ నోట్ ఎలా రాయాలి..? ఎన్ని రూపాయ‌ల వ‌ర‌కు ప్రామిస‌ర్ నోట్ ను రాసుకోవొచ్చు.! గుర్తుపెట్టుకోవాల్సిన 10 విషయాలు ఇవే.!

అప్పు తీసుకున్నప్పుడు లేదంటే ఇంకేదైన ఆర్ధిక సహాయం పొందినప్పుడు దానికి రుజువుగా అప్పు తీసుకున్నవారు ప్రామిస‌రీ నోటు రాసి ఇవ్వడం ఆనవాయితి..మనలో చాలామంది స్టాంప్ పేపర్ పై రాసుకోవడమో ,లేదంటే ఫ్యాన్సీ షాప్స్ లో దొరికే ప్రామిసరీ నోట్స్ తీసుకొచ్చి ప్రామిసరీ నోట్స్ రాసుకోవడమో చేస్తుంటాం..అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి..అది రాసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..రాసుకునే వ్యక్తులకు ఏ అర్హతలు కలిగిఉండాలి అనే విషయాలు తెలుసుకోండి..

ప్రామిసరీ నోట్ అంటే ఐ ప్రామిస్ యూ..నేను నీకు వాగ్దానం చేస్తున్నాను  ..నీ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేస్తాను అనే ఉద్దేశ్యంతో వచ్చినదే ప్రామిసరీ నోట్..దీని కాల పరిమితి మూడెండ్ల కాలం వరకూ ఉంటుంది..అసలు ప్రామిసరీ నోట్ ఎలా రాసుకోవాలి అనే సంశయం చాలా మందికి ఉంటుంది.. నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను.తిరిగి నేను నీకు కానీ,మీకు సంభందించిన వారికి చెల్లించగలవాడను అనే లైన్ ఖచ్చితంగా ఉండాలి.ఒక కోటి రూపాయల వరకూ ప్రామిసరీ నోట్ రాసుకోవచ్చు..కానీ పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేప్పుడు న్యాయవాది సమక్షంలో ప్రామిసరీ నోట్ రాసుకోవడం ఉత్తమం..

అర్హతలు&జాగ్రత్తలు

  • ప్రామిసరీ నోట్ రాసుకునేప్పుడు అప్పు ఇచ్చేవారికి,తీసుకునేవారికి కూడా కొన్ని  అర్హతలుండాలి..అప్పు ఇచ్చేవారు మైనర్ అయి ఉండకూడదు.తీసుకునేవారికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు పై బడి ఉండాలి..
  • మతిస్థిమితం లేని వారు ప్రామిసరీ నోట్ రాసినా చెల్లదు..
  • ప్రామిసరీ నోట్ రాసుకునేప్పుడు ఇద్దరి విట్నెస్ లు తప్పనిసరిగా ఉండాలి.తర్వాత ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు  ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
  • ప్రామిసరీ నోట్ రుణదాత (అప్పు ఇచ్చేవారు) రాయకూడాదు..రుణ గ్రహీత(అప్పు తీసుకునేవారు) రాయొచ్చు.ఇక్కడ వ్రాసి ఇవ్వడానికి,వ్రాయించి ఇవ్వడానికి తేడా ఉంటుంది..థర్డ్ పర్సన్ చేత రాయించినప్పుడు వ్రాయించి ఇస్తున్నాను అనేది వస్తుంది..అప్పుడు ఆ ధర్డ్ పర్సన్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది.
  • రెవెన్యూ స్టాంప్ లేకపోతే కొన్నిసార్లు ప్రామిసరీ నోట్ చెల్లకపోవచ్చు.మినిమం రూపాయి  స్టాంప్ అంటించినా కూడా సరిపోతుంది..స్టాంప్ పై సంతకం చేయాలి..అది కూడా క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుంది.
  • ఎవరన్నా జామీన్ ఉన్నట్టైతే జామీన్ దార్ సంతకం కూడా తీసుకోవాలి..
  • ప్రామిసరీ నోట్ కి మూడేండ్ల కాలపరిమితి ఉంటుంది..ఆ పరిమితి దాటిన తర్వాత కంటిన్యూ చేసుకునే ప్రొసిజర్ ఉంటుంది.అది ఏ విధంగా అంటే తీసుకున్న అప్పులో కొంత అమౌంట్ చెల్లించి,తిరిగి ప్రామిసరీ నోట్  వెనుక సంతకం చేసినట్టైతే మూడేండ్ల పరిమితి పెరుగుతుంది.దీన్నే తిరిగి రాయించుకోవడం  అంటారు.
  • అప్పు తీసుకున్న తర్వాత ఏదన్నా లీగల్ గా సమస్య వస్తే అప్పు ఇచ్చే వ్యక్తి అంత డబ్బు  ఏ విధంగా ఇచ్చాడు అనే లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.
  • ప్రామిసరీ నోట్ రాసుకున్న తర్వాత కూడా కొందరు డబ్బు తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడుతుంటే లీగల్ గా ప్రొసీడవ్వొచ్చు.

Comments

comments

Share this post

scroll to top