పేద పిల్లల చదువు కోసం…తానే ఓ వ్యవస్థై ముందుకు కదిలిన ప్రోఫేసర్. తిట్లకు ఎదురొడ్డి నిలబడి సాధించిన సార్ కు సలాం.

స్పందించే హృదయం ఉండాలే గానీ సమాజం కోసం ఎవరైనా ఎంతటి పనైనా చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఆ ప్రొఫెసర్. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆచార్య వృత్తిలో ఉండి కూడా పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం నిధులను సమీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. తనను చూసి ఎవరు నవ్వినా, ఏమనుకున్నా మానవతా హృదయంతో సమాజ సేవకు అంకితమయ్యాడు. వివరాల్లోకి వెళితే…

ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ దేశాయ్ ఆచార్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఓ రోజు తమ యూనివర్సిటీ విద్యార్థులు తెచ్చిన పరిశోధన నివేదికను చదివి ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పలు మారుమూల గ్రామాల్లో ప్రాథమిక విద్య అత్యంత దయనీయ స్థితిలో కొనసాగుతుందని ఆ పరిశోధన నివేదికలో పేర్కొనబడింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రొఫెసర్ దేశాయ్ పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా మాత్రం జరగలేదు.

12828539_462718447270471_9144235813902088067_o-e1458113774481

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రొఫెసర్ దేశాయ్ మరో ఇద్దరు ప్రొఫెసర్లతో కలిసి ఓ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అందుకు తగ్గ నిధులు వారి వద్ద లేవు. ఈ నేపథ్యంలోనే వారికి పలువురు కార్పొరేట్ సంస్థలు గుర్తుకు వచ్చాయి. వారు తమ సామాజిక సేవా బాధ్యతగానైనా ముందుకు వస్తారనని ఆ ప్రొఫెసర్లు భావించారు. ఈ క్రమంలో దాదాపు 250 పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఓ మీటింగ్‌కు హాజరు కావాలని లేఖలు రాశారు. ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు వచ్చారు, వెళ్లారు. కానీ ప్రయోజనం లేదు. తీరా అసలు విషయం ఆరా తీయగా వారు కేవలం స్పోర్ట్స్ మీట్ లాంటి వాటి కోసమైతే నిధులు వెచ్చిస్తామని, అది తమ కంపెనీ ప్రమోషన్ కోసం కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ప్రొఫెసర్ దేశాయ్‌కు అర్థమైపోయింది. కార్పొరేట్ కంపెనీలు విరాళం ఇవ్వవని నిర్దారించుకున్నాడు. దీంతో వినూత్న రీతిలో నిధుల సమీకరణ మొదలు పెట్టాడు.

12828539_462718447270471_9144235813902088067_o-e1458113774481-tile

ఈ క్రమంలోనే 2010 సెప్టెంబర్‌లో తాను ప్రయాణిస్తున్న ముంబై లోకల్ ట్రెయిన్ ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఓ డొనేషన్ బాక్స్ పట్టుకుని విరాళం ఇవ్వమని అర్థించాడు. అలా ఆ రోజంతా ఆయన దాదాపు రూ.700 వరకు నిధులను సమీకరించగలిగాడు. దీంతో ఆయనకు విషయం బోధపడింది. అలా రోజుకు దాదాపు 7 నుంచి 8 గంటల పాటు విరాళాలు సేకరిస్తూనే ఉండేవారు. దీంతో ఆయన్ను చూసి కొంత మంది నవ్వుకునే వారు. మరికొందరు హేళన చేసే వారు. అయినా దేశాయ్ పట్టించుకోలేదు. కాగా ప్రజలను మోసం చేసి విరాళాలు సేకరిస్తున్నాడని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రొఫెసర్ దేశాయ్ పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆయన తన ప్రయత్నం మానుకోలేదు. చివరికి ఆయనను బిచ్చగాడని అన్నారు. దీన్ని కూడా ఆయన లైట్‌గానే తీసుకున్నాడు. చివరికి ఎలాగైతేనేం దాదాపు 5 ఏళ్ల పాటు విరాళాలు సంపాదించగా అది కాస్తా రూ.1 కోటికి చేరింది. దీంతో ఆయన చేయాలనుకున్న పనికి ఆరంభం లభించింది. ఆ కోటి రూపాయలతో ముందుగా ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను ప్రారంభించారు. అలా అలా ఒక్క స్కూల్‌తో మొదలైన ఆయన సేవ 5 స్కూళ్లను పెట్టేలా చేసింది.

ప్రస్తుతం ప్రొఫెసర్ దేశాయ్ నేతృత్వంలో దాదాపు 5 ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పలు మారుమూల గ్రామాల్లో నడుస్తున్నాయి. వీటిల్లో దాదాపు 480 మంది విద్యార్థులు 4వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత చేసినా ఆయన ఓవైపు ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే మరోవైపు విరాళాలు సేకరిస్తూనే ఉన్నారు. ఆయనను యాచకుడని అనే వారు అంటూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రొఫెసర్ దేశాయ్ మాత్రం వాటినేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.

Comments

comments

Share this post

scroll to top