పేపర్ బాయ్’ దర్శకుడిపై ఆసక్తి చూపుతున్న నిర్మాతలు

సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు జయశంకర్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఫీచర్ ఫిల్మ్ చేయడానికి ముందే జయశంకర్ హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసిన సంపత్ నంది అతడిలోని డైరెక్షన్ టాలెంట్‌ను గుర్తించి తన సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు.

‘పేపర్ బాబ్’ ఒక మామూలు చిన్న సినిమా అయినా చూడటానికి… మీడియం రేంజి సినిమాలా ఔట్ పుట్ రావడానికి… అన్ని విభాగాలను సమన్వయం చస్తూ దర్శకుడు జయశంకర్ పెట్టిన ఎఫర్టే అని అంటున్నారు చిత్ర యూనిట్. సంపత్ నంది ఇచ్చిన కథను అతడు తెరపైకి సుందర దృశ్య కావ్యంలా మలచడంలో, నటీనటుల నుండి తనకు కావాల్సిన ఔట్ పుట్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

సంపత్ నంది సైతం ఇటీవల పలు ప్రెస్ మీట్లలో దర్శకుడు జయశంకర్ పనితీరుపై ప్రశంసలు గుప్పించారు. ఈ యంగ్ డైరెక్టర్లో మంచి విషయం ఉండటంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారట.

Comments

comments

Share this post

scroll to top