వావ్.. వాట్ ఎ క్యాచ్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో బెస్ట్ క్యాచ్ బ‌హుశా ఇదే కావ‌చ్చు..!

ఐపీఎల్‌లో ఇప్ప‌టికే స‌గం మ్యాచ్‌లు అయిపోయి ఫైన‌ల్ ద‌శ‌కు జ‌ట్లు చేరుకుంటున్నాయి. దీంతో ఆయా టీంల‌పై ఒత్తిడి కూడా ఎక్కువైంది. మొదటి రెండు స్థానాల్లో ఉండాలని కొన్ని జట్లు తాప‌త్ర‌య ప‌డుతుంటే కొన్ని జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఈ కోవ‌లోనే ప్ర‌తి టీం అందివ‌చ్చిన స‌ద‌వ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని అంశాల్లో రాణించేందుకు ప్లేయ‌ర్లు శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పంజాబ్‌, రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్, మ‌నోజ్ తివారీలు అద్భుత‌మైన ఫీల్డింగ్ చేసి ఆక‌ట్టుకున్నారు. సిక్స్ వెళ్లాల్సిన బంతిని ఒడిసి ప‌ట్టుకున్నారు.

రాజ‌స్థాన్‌, పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో మొద‌ట రాజ‌స్థాన్ 20 ఓవ‌ర్ల‌కు 152 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా, పంజాబ్ జ‌ట్టు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా ఛేదించి త‌న ఖాతాలో మ‌రో విజయాన్ని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో ఆ జ‌ట్టు ఆట‌గాడు బెన్ స్టోక్స్ ఆడుతుండ‌గా 13వ ఓవ‌ర్‌లో పంజాబ్ ఆట‌గాడు ముజీబ్ బౌలింగ్ వేశాడు. అందులో ఒక బాల్‌ను స్టోక్స్ భారీగా బాదాడు. అది సిక్స‌ర్ వైపు వెళ్లింది. అయితే బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న మ‌యాంక్ ఆ బాల్‌ను సిక్స్ పోకుండా గాల్లోనే ప‌ట్టుకున్నాడు. కానీ బౌండ‌రీ వ‌ద్ద ఉండ‌డంతో అత‌ను బ్యాలెన్స్ చేసుకోలేక గాల్లో ఉండ‌గానే ఆ బంతిని ప‌క్క‌నే ఉన్న తివారీ వైపు విసిరాడు. దీంతో తివారీ ఆ క్యాచ్ ప‌ట్టుకున్నాడు.

అలా మ‌యాంక్ అగ‌ర్వాల్‌, మ‌నోజ్ తివారీలు బెన్ స్టోక్స్ క్యాచ్‌ను అద్భుతంగా ప‌ట్టుకున్నారు. దీంతో రాజ‌స్థాన్ కీల‌క వికెట్ కోల్పోయింది. అనంత‌రం త‌క్కువ స్కోరు చేసింది. దీంతో పంజాబ్ ఆ మ్యాచ్‌లో అల‌వోక‌గా గెలిచింది. అయితే అలా మ‌యాంక్ అగ‌ర్వాల్‌, మ‌నోజ్ తివారీలు ప‌ట్టిన క్యాచ్ వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. చాలా మంది దాన్ని వీక్షించారు. ట్విట్ట‌ర్ లో అభిమానులు ఆ క్యాచ్‌కు జేజేలు ప‌లుకుతున్నారు. ఆ క్యాచ్ ప‌ట్టుకున్న ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను అభినందిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top