ప్రామిస్ డే రోజు ఈ 10 ప్రామిస్ లు చేస్తే మీ ప్రేమ మీకు ఎప్పటికి దూరం కాదు, వాలెంటైన్స్ వీక్ స్పెషల్.!

ప్రామిస్ డే అంటే మాములు రోజు కాదు, వాలెంటైన్స్ వీక్ లో ప్రామిస్ డే కి చాలా ప్రత్యేకత ఉంది. ప్రామిస్ డే రోజు చేసే ప్రామిస్ లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలి, ఈ 10 ప్రామిస్ లు చేసి వాటిని నిలబెట్టుకుంటే, జీవితాంతం మీ ప్రేమ మీకు ఎప్పటికి దూరం కాదు.

  1.  మన మధ్య ఏ కొట్లాట జరిగినా నిన్ను ఎన్నడూ విడువను.
  2.  నీ విషయం లో నేను ఏదైనా సీరియస్ గానే తీసుకుంటా.
  3.  నీ వెన్నంటే నిత్యం ఉంటా, మంచైనా చెడైనా నీ చెయ్యి ఎప్పుడు వదలను, ఏ కష్టమొచ్చినా కలిసి ఎదురుకుందాం.
  4.  నీ తరువాతే నాకు ఎవరైనా, నీ తరుపున నేను నిలబడతా దేంట్లో అయినా.
  5.  నీతో కొట్లాట అయిన రోజుల్లో కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని నీకు గుర్తు చేస్తా.
  6.  నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా.
  7.  నా చెయ్యి విడిచి నాకు దూరంగా వెళ్లినా, నిన్ను నేను వీడను, నీతో కొట్లాట పడి అయినా, నీ చేతిని పట్టుకొని నిన్ను వెనక్కి తీసుకొని వస్తా.
  8.  నీకు ఇష్టం లేని పనులు ఎప్పటికి చెయ్యను.
  9.  నీకు ఇష్టమైనవి నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా.
  10.  ఈ ప్రామిస్ లన్ని నిలుపుకోడానికి ప్రయత్నిస్తా అని ప్రామిస్ చేస్తున్నా.

అసలు ఇన్ని ప్రామిస్ లు చేయడం అవసరమా అని మీకు అనిపిస్తే, కనీసం ఒక్క మాట చెప్పండి. ” ఒట్టేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట చెప్పను ” – ఛత్రపతి.

Comments

comments

Share this post

scroll to top