ప్రియుడ్ని చెప్పుతో కొట్టి…తాళి కట్టించుకుంది ఆ యువతి..! అసలేమైందో తెలుస్తే ఆ నీచుడ్ని తిట్టుకుంటారు.!

ప్రియుడు కాదన్నాడని ఆత్మహత్య…అత్తమామలు వేధించారని గృహిణి  ఆత్మహత్య.. కాలేజ్ లో ర్యాగింగ్ చేశారని మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం.ఇవి కదా వార్తలు..కానీ ఛల్ ఇంకెన్ని రోజులు వేధింపులు.. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించిందో యువతి..ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినవాన్ని చెప్పు తెగేదాక కొట్టింది..ప్రియున్నే కాదు అడ్డొచ్చినవాళ్లందరిని ఒక్కర్తే ఎదుర్కొంది..ఆఖరుకి..కాదన్నవాడితోనే తాళి కట్టించుకుంది..

కర్నూలు జిల్లా పాణ్యంలోని రాంభూపాల్‌రెడ్డి కాలనీకి చెందిన దివ్యాబాయి, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ మూడేళ్లుగా  ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి ప్రేమకు అడ్డు చెప్పడంతో రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నారు.తన ఇంటిని వదిలిపెట్టి వచ్చి చంద్రశేఖర్ తోనే ఉంటుంది దివ్య.అక్కడ వీరిద్దరి ఖర్చులు వగైరా అన్నీ దివ్యే చూసుకుంటుంది. ఒకవైపు దివ్యతో సహజీవనం చేస్తూ మరోవైపు అత్తకూతురుతో పెళ్లికి సిద్దపడ్డాడు చంద్రశేఖర్..ఇదే విషయంత తెలుసుకున్న దివ్యాబాయి చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి నిలదీసింది.పెద్దల మధ్య పంచాయితి పెట్టించింది..అంతేకాదు అదే పంచాయితిలో చంద్రశేఖర్ ను చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది.అడ్డొచ్చిన అత్త ,ఆడపడుచులను కూడా కొట్టింది..  తనకు న్యాయం చేయాలని పంచాయితీ పెద్దలను నిలదీసింది..తర్వాత పోలిస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు,పెద్దల సమక్షంలో టెక్కెలోని సుంకులమ్మ దేవాలయంలో వారి వివాహం జరిపించారు.

watch video here:

Girl Beats Up Her Boyfriend After He Denies Marriage | Teenmaar News

Girl Beats Up Her Boyfriend After He Denies Marriage | Teenmaar News Click Here to More : https://youtu.be/SRkuYigsHOI

Posted by V6 News on Thursday, 1 February 2018

Comments

comments

Share this post

scroll to top