ప్రియుడు చూస్తుండగానే లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న అనీషా చౌదరి కేసు గురించి అందరికి తెలిసిందే. గత వరం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ప్రియుడుతో అభిప్రాయభేదమే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు తెలియచేసారు. కానీ ఈ విషయంలో అనీషా తల్లితండ్రులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హనీషా, ఆమె ప్రియుడు దీక్షిత్ పటేల్‌ల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాల్లో కొన్ని డీలీట్ అయ్యాయా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేసారు.
హనీషా చౌదరి తల్లిదండ్రులు పోలీసులను కలిసి తమ కూతురు చనిపోవడానికి గల కారణాలను చెప్పాలని కోరారు. ప్రియుడి ప్రేరణతో చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కలవడంపై పోలీసులు మాట్లాడుతూ.. వారు అనుమానం వ్యక్తం చేయలేదని, ఏం జరిగిందో చెప్పమని అడిగారని తెలిపారు. వీడియో చాటింగులు డిలీట్ అయ్యాయని అంటున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీలో అనీషా చౌదరి అనే యువతి ఎంబీఏ చదువుతోంది. ఈమెది అనంతపురం జిల్లా. ఈమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఇక ఈమె తమ కాలేజీలోనే చదువుతున్న దక్షిత్ పటేల్ అనే యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తోంది. అయితే ఈమెకు సమస్య ఉందో తెలియదు కానీ.. తీవ్రమైన మానసిక వేదనకు లోనైంది. లవ్ ఫెయిలా లేదంటే మరేదైనా విషయం ఉందా అనేది తెలియదు. కానీ తాజాగా తన ప్రియుడు దక్షిత్ పటేల్‌తో అర్థరాత్రి 2.30 గంటల సమయంలో వీడియో కాల్లో మాట్లాడుతూ సడెన్‌గా ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం జిల్లాకు చెందిన జగ్గయ్య చౌదరి, కుమార్తె అనీషా చౌదరి (23) కొంపల్లిలోని శివశివానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్ లో ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న మేడ్చల్ గ్రామానికి చెందిన దీక్షేశ్ పటేల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా ఆమెకు గతంలో అనంతపురానికి చెందిన ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇటీవలే అతని పెళ్లి కూడా కుదరడంతో అనీషాను ఆహ్వానించాడు. ఈ నెల 26న జరగనున్న తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. పెళ్లికి వెళ్లాలా? వద్దా? ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.
దక్షేశ్ పటేల్ కూడా ఆమెకేమి అభ్యంతరం చెప్పలేదు. అనీషా పెళ్లికి వెళ్తానని అడగ్గానే వెళ్లమని చెప్పాడు. కానీ ఆ తర్వాత లేనిపోని అపోహలతో ఆమె సతమతమైంది. పెళ్లికి వెళ్తే దక్షేశ్ పటేల్ తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడోనని తనలో తానే ఆవేదన చెందింది.ఈ నేపథ్యంలో 16 నుంచి 17వ తేది అర్ధరాత్రి వరకు చాటింగ్ ద్వారా మాటల యుద్దం నడిచింది. రెండు రోజుల వ్యవధిలో 320 కు పైగా మెసెజ్‌లు అనీషాచౌదరి ఫోన్లో నిక్షిప్తమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాటా మాటా పెరిగి తననే అనుమానిస్తున్నావా అంటూ .ప్రియుడు దీక్షేశ్ కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
హనీషా తల్లిదండ్రుల అనుమానాల మేరకు విచారణ జరిపి, వారికి అనుమానాలు ఉంటే పోలీసులు నివృత్తి చేయనున్నారు. ఆమె సూసైడ్ చేసుకోవడానికి అతను ప్రేరేపించారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.