‘భయ్యా జీ’ అలియాస్ ప్రియాంక గాంధీ, జనాలు ఆమెను భయ్యా జీ అని ఎందుకు అంటారో తెలుసా.?

పొలిటికల్ ఎంట్రీ ఆలా ఇచ్చారో లేదో, సోషల్ మీడియా నుండి మీడియా వరకు అందరూ ప్రియాంక గాంధీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఆమె పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకున్నా ఆమెకు ఇంత క్రేజ్ ఎలా సాధ్యం అని చాలా మంది అనుకుంటున్నారు.. ఆమెను ఉత్తరాది ప్రజలు ముద్దుగా భయ్యా జీ అని పిలుస్తారు, ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ జనాలు..

భయ్యా జీ అని పిలవడానికి కారణం.

ప్రియాంక గాంధీ చిన్నప్పుడు తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ తో కలిసి రాయబరేలీకి వెళ్లేవారు. అప్పుడు ఆమె జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉండేవారు. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు గ్రామస్తులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా ‘భయ్యా’ అని పిలిచేవారు. ఆ తర్వాత రానురాను ‘భయ్యా జీ’ అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు.

ఆమె 2014 ఎన్నికల్లో వారణాసి నుండి పోటీ చెయ్యాలని భావించినట్టు సమాచారం, కానీ 2014 న వారణాసి నుండి మోడీ పోటీ చెయ్యడం తో ఆమె అప్పుడు పోటీ చెయ్యదలుచుకోలేదని సమాచారం, ప్రతుతం ప్రియాంక గాంధీ ని ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ నియమించింది. దీంతో ఈమె పైన ఇప్పుడు పెద్ద భారం ఉంది, ఎందుకంటే ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతం లో 30 కి పైగా పార్లమెంట్ సీట్ లు ఉన్నాయి, అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ అంతటా ఆమె పర్యటించి కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ కు ఆధిపత్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రియాంక ఇప్పటి వరకూ సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్ బరేలీలలో ప్రచారానికే పరిమితమయ్యారు. తొలిసారిగా ప్రియాంకకు పార్టీలో అధికారికంగా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు.

దేశమంతటా.. :

అయితే ఈ ఎన్నికల్లో ఒక వేళ కాంగ్రెస్ ఓడిపోతే, పార్టీ పగ్గాలు ప్రియాంక చేతికి ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది, రాహుల్ గాంధీ స్థానం లో ప్రియాంక గాంధీ ని చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీ లో అధికారికంగా బాధ్యతలు తీసుకోకముందు నుండే పార్టీ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేవారు ప్రియాంక గాంధీ, ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రావడం తో పార్టీ దిశా దశ ను పూర్తిగా మార్చేస్తుందని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

 

Comments

comments

Share this post

scroll to top