పాపం “ప్రియాంక చోప్రా”: సరదా పడి వెరైటీ డ్రెస్ వేసుకుంది..! నెటిజన్లు ఎలా ఎగతాళి చేసారో చూడండి!

సెలబ్రిటీలు, వీఐపీలు అన్నాక అప్పుడ‌ప్పుడు నోరు జారో లేదంటే వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, అనంత‌రం దాని ప‌ర్య‌వ‌సానాల కార‌ణంగా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం స‌హ‌జ‌మే. ఇది మ‌న దేశంలో ఉన్న అన్ని భాష‌ల‌కు చెందిన సినీ తార‌ల‌కు కొత్తేమీ కాదు. ఈ క్ర‌మంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌కున్నా కొన్ని సార్లు తార‌లు చేసే ప‌నుల వ‌ల్ల కూడా వారు జ‌నాల నుంచి పెద్ద ఎత్తున విమర్శ‌లు ఎదుర్కొంటుంటారు. కాల‌క్ర‌మేణా స‌ద‌రు వివాదాలు స‌ద్దుమ‌ణుగుతాయ‌నుకోండి, అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా వెరైటీ డ్రెస్సులో హీటెక్కించింది. బాల్‌గౌన్ కోట్‌లో హాట్ బేబీలా ద‌ర్శ‌న‌మిచ్చింది.

న్యూయార్క్‌లో జ‌రిగిన మెట్ గాలా ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా ట్రెంచ్ కోట్ డ్రెస్సులో మెరిసిపోయింది. మెట్‌గాలా కాస్ట్యూమ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌తి ఏడాది ఈ షో నిర్వ‌హిస్తున్న‌ది. అయితే ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రియాంక వేసుకున్న డ్రెస్ నెటిజన్లకు అంతగా నచ్చినట్లు లేదు. డ్రెస్‌ ముందంతా బాగానే ఉంది కానీ వెనుక మాత్రం పెద్ద దుప్పటి పరిచినట్లు ఉంది.

దాంతో ప్రియాంక వేసుకున్నడ్రెస్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ప్రియాంక వేసుకున్న డ్రెస్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ…

ఇది స్వచ్ఛ భారత్‌ కోసం వేసుకున్న డ్రెస్‌

  • ఐపీఎల్‌ సమయంలో వర్షం పడితే మైదానం తడవకుండా ప్రియాంక డ్రెస్‌తో కప్పేయండి
  • హాయ్‌ రే ఇది నా గాగ్రా..పంజాబ్‌ నుంచి ఆగ్రా మీదుగా ఢిల్లీకి తీసుకొచ్చా
  • ప్రతీ ఒక్కరు ఇలాంటి డ్రస్ వేసుకుని 100 మీటర్లు నడిస్తే చాలు భారత దేశం అంతా గంటలో క్లీన్ అవుతుంది
  • ఓ మై గాడ్ శశికళా…ఎందుకు ప్రియాంకను ఆపుతున్నావు
  • నీ బెడ్ షీట్ ను వేసుకుని వెళ్లు
  • అమీర్ ఖాన్.. గజినీ పాటను ఈ గౌనుపైనే తీశారట
  • ఊడ్చే అవార్డుల కార్యక్రమానికి ఇలాగే వెళ్తారట
  • ఇల్లు ఊడ్చే గౌనంట
  • లేడీ కానిస్టేబుల్ కొత్త ఫ్యాషన్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top