సింపుల్ గా “రిజిస్టర్” మ్యారేజ్ చేసుకున్న “స్టార్ హీరోయిన్”..! బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకి..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషల్లో నటించిన కథానాయిక ప్రియమణి.. తన ప్రియుడు ముస్తఫా రాజ్‌ను గుట్టు చప్పుడు కాకుండా వివాహమాడింది. బుధవారం (ఆగస్టు 23) ఉదయం రిజిస్ట్రేషన్ ఆఫీసులో సింపుల్‌గా ఈ తంతు పూర్తైంది. ఈ వేడుకకు అత్యంత స‌న్నిహితులు, కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్ర‌మే హాజ‌రయ్యారు. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడం వల్ల రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు రోజు ప్రియ‌మ‌ణి ఇంట మెహందీ, సంగీత్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి సింపుల్‌గా చేసుకున్నా రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. బెంగ‌ళూర్‌లో గురువారం సాయంత్రం జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రవనున్నారు. రిసెప్ష‌న్ త‌ర్వాత మ‌రో 2 రోజుల్లోనే ఈ అమ్మ‌డు షూటింగ్‌కి యథావిథిగా వెళ్లనుంది.

తాను సినిమాల్లో కొనసాగే విషయంలో ముస్తాఫా రాజ్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియమణే స్వయంగా తెలిపింది. ప్ర‌స్తుతం మలయాళంలో ‘సైలంట్‌ రేడియో’, ‘పెర్ఫ్యూమ్‌’, ‘యస్‌ ఐ యామ్‌’, ‘పెయింటింగ్‌ లైఫ్‌’, ‘గ్రాండ్‌ మాస్టర్‌ 2’, ‘సత్యాన్వేషణ పరీకణగళ్‌’ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనూ ఒకట్రెండ్ టీవీ షోలు చేస్తోంది.

ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ రన్ చేస్తున్న ముస్తఫా రాజ్‌తో ప్రియమణి.. గత అయిదేళ్లుగా ప్రేమలో ఉంది. తొలిసారిగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా ముస్తఫా పరిచయం అయినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఓ డ్యాన్స్ షో వల్ల వీరి బంధం మరింత బలపడి ప్రేమగా మారింది.

ముస్తఫా యాటిట్యూడ్, నిజాయితీ, సెన్సాఫ్ హ్యూమర్ నచ్చే అతడితో ప్రేమలో పడిపోయానని ప్రియమణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వీళ్ల ఎంగేజ్‌మెంట్ 2016 మే 27నే జరిగింది. సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లు ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Comments

comments

Share this post

scroll to top