ఐఐటీ ప్రశ్నాపత్రంలో కన్ను కొట్టిన “ప్రియా ప్రకాష్” పై ప్రశ్న..! ఆ ప్రశ్న ఏంటో తెలుసా.? అసలేమైంది.?

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడీమె ఓ సెన్సేష‌న్. ఒకే ఒక ఓర కంటి చూపు, కొంటె న‌వ్వుతో యువ‌త హృద‌యాల‌ను దోచింది. క‌న్ను కొట్ట‌డంతో ఆమెకు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు అయ్యారు. ఆమె ఒక్క రోజులోనే 6 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్ల‌ను ఇన్‌స్టాగ్రాంలో సంపాదించుకోగా అందులో ఇప్పుడామెకు 51 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు వ‌చ్చి చేరారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీల‌కు ఇన్‌స్టాగ్రాంలో ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను ఆమె దాటేసింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా యువ‌త ఈమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అంత‌గా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ పాపుల‌ర్ అయింది. అయితే ఆమెకున్న‌ పాపులారిటీని ఉప‌యోగించుకుని ఆ ఐఐటీ ప్రొఫెస‌ర్ తాను విద్యార్థుల‌కు ఇచ్చే ప్ర‌శ్నాపత్రంలోనూ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ పేరు చేర్చి ఓ ప్ర‌శ్న త‌యారు చేశాడు. దీంతో ఇప్పుడీ ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఐఐటీ బాంబేలో మెషిన్ లెర్నింగ్ కోర్సులో మిడ్ ట‌ర్మ్ ఎగ్జామ్స్‌లో భాగంగా నిర్వ‌హించిన ఓ ఎగ్జామ్‌లో ఓ ప్ర‌శ్న ఇచ్చారు. అందులో ప్రియా ప్ర‌కాష్ పేరు ఉంది. ప్రియా ప్ర‌కాష్‌కు ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌కు కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో కామెంట్లు వ‌చ్చాయ‌నుకుంటే వాటిల్లో అస‌భ్య‌క‌రంగా, అనుచితంగా ఉన్న కామెంట్ల‌ను ఏరి ఫిల్ట‌ర్ చేయ‌డం కోసం మీరు ఏం చేస్తారు ? అని ఆ ప్ర‌శ్న అడిగారు. దీన్ని ఆ స‌బ్జెక్టును బోధించే ప్రొఫెస‌ర్ అమిత్ సేథి ఇచ్చారు.

అయితే ప్రొఫెస‌ర్ అమిత్ సేథి ఈ ప్ర‌శ్న‌లో ప్రియా ప్ర‌కాష్ పేరును ఎందుకు చేర్చాడంటే ఆమెకు ఈ మ‌ధ్య బాగా పాపులారిటీ వ‌చ్చింది క‌దా. దీంతో ఆమె పేరిట ఏదైనా ప్ర‌శ్న వేస్తే విద్యార్థుల‌కు కొంత భిన్నంగా అనిపిస్తుంద‌ని, రొటీన్ ప్ర‌శ్న‌లా కాకుండా ఉంటుంద‌ని, దీంతో వారు సుల‌భంగా ఎగ్జామ్ రాసేందుకు, స్ట్రెస్ లేకుండా ఫీల‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అలా ఇచ్చార‌ట‌. దీంతో ఈ ప్ర‌శ్న‌ను చూసి విద్యార్థులు చాలా మంది న‌వ్వుకున్నారు. ఇక ప్ర‌స్తుతం ఇదే ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ప్రియా ప్ర‌కాష్ ఐఐటీ దాకా వెళ్లింది, ఇక‌పై స్పేస్ సైన్స్‌లోకి వెళ్తుందేమో అని కొంద‌రు చ‌మ‌త్క‌రిస్తున్నారు. ఏది ఏమైనా… ఈ ప్ర‌శ్న మాత్రం భ‌లే చిత్రంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top