ప్రియా ప్రకాష్ పాటపై “సీఎం” ఫేస్బుక్ లో ఏమని పోస్ట్ చేసారో తెలుసా.? ఇంకేం పనిలేదా అంటూ కామెంట్స్…!

మలయాళం మూవీ ‘ఒరు అధార్ లవ్’ ఇంకా రిలీజ్ కాలేదు..ప్రేమికుల రోజు సంధర్బంగా రిలీజ్ చేసిన ఒక పాట,టీజర్ ఇప్పుడు సంచలనం అయ్యాయి.ఆ పాటలో హీరోయిన్ పలికించిన భావాలు అందరిని ఆకట్టుకోవడమే విషేశం.ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గొట్టి.. యువకుల హృదయాలను కొల్లగొట్టింది. కళ్ళతో ఆమె పలికించిన భావాలు భాషా భేదం లేకుండా.. అందరిని ఆకట్టుకుంది.అయితే ఇప్పుడు ఆ మూవీ,ఆ అమ్మాయి నేషనల్ టాపిక్స్ అయ్యాయి.వివాదాలు చుట్టుముట్టాయి.ఇదే విషయంపై  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు..

ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరయ పూవీ పాట విశేషంగా ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.ముస్లింల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఉన్నాయని ఇప్పటికే సినిమా దర్శకుడిపై ,ప్రియా ప్రకాశ్ పై కేసులు నమోదయ్యాయి.సినిమా విడుదలను ఆపేయాలనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే ఆ పాటలో అభ్యంతరకరంగా ఏం లేవని దర్శకుడు ఒమర్ లులు ఇప్పటికే వివరణ ఇచ్చారు ఇదే విషయంపై స్పందించారు విజయన్.


ఆయన తన ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు… కళలో భావప్రకటన స్వేఛ్చపై అసహనాన్ని సహించేది లేదంటూ పాట పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించారు.ముస్లిం సంప్రదాయం పాట ఆధారంగా పిఎంఎ జబ్బర్ రాసిన ఈ పాటను రఫీక్ పాడారు. 1978లో ఆకాశవాణిలో ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడిగా ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా” అని అన్నారు. “అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఆ పాటపై అభ్యంతరం ఏమిటి. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు” అని విజయన్ అన్నారు.

Comments

comments

Share this post

scroll to top