ప్రియా ప్రకాష్ తండ్రి ఆఫీస్ లో ఉండగా..పక్కన వ్యక్తి వాట్సాప్ లో ప్రియా వీడియో చూపించేసరికి ఏమైందో తెలుసా.?

మోడల్ లా ఉన్నావని అంకుల్ అన్న మాటలే మైండ్లో ఫిక్స్ అయిపోవడంతో తొలుత మోడలింగ్ లోకి,తర్వాత  సినిమాల్లోకి అడుగు పెట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్… పరిచయం అక్కర్లేని అమ్మాయి..సినిమారిలీజ్ అవ్వకముందే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సెలబ్రిటి..కేవలం కన్నకొట్టి కుర్రకారునే కాదు అందరిని కట్టిపడేసింది.రాత్రికి రాత్రి పెరిగిపోయిన ఫాలోవర్స్  అదికూడా సన్నిలియోన్ ని మించిన సంఖ్య..ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదనుకుంటా ఆమె సెలబ్రిటి స్టేటస్ ఏంటో.. అసలు ప్రియకు ఒరు ఆధార్ లవ్ లో అవకాశం ఎలా వచ్చింది.ఈమె సెలబ్రిటి స్టేటస్ తర్వాత ఇప్పుడు వాళ్ల ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి..ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

  • ఒరు ఆధార్ లవ్ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్ కి వెళ్లినప్పుడు కంగారులో ఆడిషన్ సరిగ్గా ఇవ్వలేకపోయింది.దాంతో సినిమాలో చిన్న అవకాశం అది కూడా ఐదుగురు అమ్మాయిల్లో ప్రియ ఒకర్తిగా సెలక్ట్ అయింది.ఆ తర్వాత ప్రియా యాక్టింగ్ చూసి తనని మెయిన్ రోల్ గా ఎంపిక చేశారు..తనలో టాలెంట్ ఏంటో ఒకట్రెండు వీడియోలతో మనకు కూడా అర్దం అయింది కదా..
  • వాట్సప్లో ప్రియ వీడియో చక్కర్లు కొడుతున్నప్పుడు ప్రియ తండ్రి కొలిగ్ ఒకరు అది వాళ్లనాన్నకి వాట్సప్ చేసి..ఈ అమ్మాయి చూసావా ఎలా చేసిందో..ఎవరో తెలుసా అని అడిగారట..దానికి ఆయన సమాధానంగా తెలుసు నా కూతురు అని చెప్పడంతో అవాక్కవడం అవతలి వ్యక్తి వంతైంది.

  • ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ప్రియకు ఒక్క మొబైల్ ఫోన్ లేకపోవడం విశేషం.ఫోన్ ఉంటుంది అందులో సిమ్ ఉండదు..ఇంట్లో వైఫై ఆన్లో ఉంటే ఫోన్ వాడడం లేదంటే లేదు..కాల్స్ మాట్లాడుకోవాలంటే అమ్మ ఫోన్ వాడడం చేసేదాన్ని అని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
  • ప్రియ పాపులర్ అయిన తర్వాత రోజూ ఇంటికొచ్చే మీడియా తో వేగలేక ప్రియను హాస్టల్ కి షిప్ట్ చేసిందట వాళ్ల అమ్మ.అంతేకాదు సినిమా రిలీజ్ వరకు సినిమా గురించి ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వొద్దని డైరెక్టర్ పెట్టిన కండిషన్ వలన కూడా హాస్టల్ కి షిఫ్ట్ అవడానికి మరో రీజన్.

  • ఆమెకు గుర్తింపు రాకముందు ఎక్కడికెళ్లాలన్నా ఆంటీనో,అమ్మనో వెంట తీసుకెళ్లేది..ఇప్పుడు మేనజర్ ని పెట్టుకుంది..ఇన్ట్స్ట్రాగ్రాంలో ప్రియ కొన్ని బ్రాండ్లకు పెట్టే పోస్టులకు ఒక్కోదానికి ఐదులక్షలు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

  • ఇటీవల మాదకద్రవ్యాల క్యాంపెయిన్ కి ప్రియ త్రివేండ్రం వెళ్లింది.అదే తొలిసారి తను విమానం ఎక్కడం.

  • ఫ్రెండ్స్ తో గడపడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది ప్రియ.అలాంటిది ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.దాంతో స్వేఛ్చని కోల్పోయావ్ అని ప్రియ తల్లిదండ్రులు ప్రియతో అంటుంటారు.

Comments

comments

Share this post

scroll to top