ఆ విషయంపై “నో కామెంట్” అంటున్న “ప్రియా ప్రకాష్”..! ఎందుకో తెలుసా..?

మలయాళం మూవీ ‘ఒరు అధార్ లవ్’ ఇంకా రిలీజ్ కాలేదు..ప్రేమికుల రోజు సంధర్బంగా రిలీజ్ చేసిన ఒక పాట,టీజర్ ఇప్పుడు సంచలనం అయ్యాయి.ఆ పాటలో హీరోయిన్ పలికించిన భావాలు అందరిని ఆకట్టుకోవడమే విషేశం.ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గొట్టి.. యువకుల హృదయాలను కొల్లగొట్టింది. కళ్ళతో ఆమె పలికించిన భావాలు భాషా భేదం లేకుండా.. అందరిని ఆకట్టుకుంది.అయితే ఇప్పుడు ఆ మూవీ,ఆ అమ్మాయి నేషనల్ టాపిక్స్ అయ్యాయి..

ఆమె ఇంటర్వ్యూ కోసం ప్రముఖ టీవీ చానళ్ళు ఎగబడ్డాయి.సినిమా రిలీజ్ వరకు ఎలాంటి ఇంటర్వూలు ఇవ్వొద్దని దర్శకుడి కోరిక మేరకు ప్రియ అదేవిధంగా ఉంది..అయితే మీడియా తాకిడి భరించలేక ప్రియ తల్లి ప్రియను ఇంటి నుండి హాస్టల్ కి పంపినట్టు సమాచారం.ఎట్టకేలకు చివరికి ప్రియా వారియర్ ని అభిమానుల ముందు ఉంచాయి. ఆమె నుంచి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాయి. ఇంత ఆకట్టుకున్న సీన్ కోసం ఎలా ప్రాక్టీస్ చేసారు? అని అడగగా.. ‘‘హీరోను చూసి చిరునవ్వు నవ్వుతూ కన్ను గీటే సీన్ ను డైరెక్ట్ గానే చేశాను. ప్రాక్టీస్ లేదు.అది ఇంత వైరల్ అవుతుందని కూడా అనుకోలేదు. అసలే మాత్రం ఊహించని ఈ పాపులారిటీ చూసి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు’’అంటూ ప్రియ ప్రకాష్ వారియర్ చెప్పింది.

మరోవైపు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ సినిమాపై,ప్రియా ప్రకాష్ పై ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి.అదే విషయాన్ని ప్రశ్నించగా. “ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. దీనిపై ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడమే మేలు” అని వెల్లడించింది. ఈ చిత్ర డైరక్టర్ ఒమర్ లులు మాత్రం పాటలో ముస్లిముల మనోభావాలు దెబ్బతినే పదాలు ఏమీ లేవని మీడియాకి స్పష్టం చేశారు.

Comments

comments

Share this post

scroll to top