ఇండియాలోని ఆ ఏరియా ఇప్పటికి “బ్రిటిష్” చేతిలో ఉంది..ఇండియన్ రైల్వే వారికి డబ్బులు చెల్లిస్తుంది తెలుసా.?

మన దేశంలో ఉన్న రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది నిత్యం రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది సిబ్బంది రైల్వేల్లో పనిచేస్తున్నారు. ఇక కొన్ని వేల సంఖ్యలో రైళ్లు నిత్యం ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. అయితే దేశంలో ఉన్న రైల్వే వ్యవస్థ మొత్తం భారతీయ రైల్వే కిందకు వస్తుంది. కానీ ఒక ప్రైవేట్‌ రైల్వే లైన్‌ మాత్రం భారతీయ రైల్వే కిందకు రాదు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటికీ ఒక ప్రైవేట్‌ లైన్‌ మన దేశంలో ఉంది. ఆ మార్గం గుండా కేవలం ఒకే ఒక ట్రెయిన్‌ నడుస్తుంది.

1951లో మన దేశంలో రైల్వేలను జాతీయం చేశారు. అయితే మహారాష్ట్రలో ఉన్న అమరావతి అనే ప్రాంతంలోని ఓ రైల్వే లైన్‌ను పట్టించుకోలేదు. ఎందుకంటే అది బ్రిటిష్‌ కంపెనీ అయిన గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే (జీఐపీఆర్‌)కు చెందుతుంది కనుక. దీంతో ఆ రైల్వే రైల్‌ను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ రైల్వే లైన్‌ను నడిపించేందుకు మన దేశం ఏటా ఆ కంపెనీకి రూ.1.20 కోట్లను ఇస్తోంది.

ఇక అమవరాతిలో ఉన్న ఆ రైల్వే లైన్‌ యువత్‌మల్‌, మూర్తిజాపూర్‌లను కలుపుతుంది. మధ్యలో 17 స్టేషన్లు వస్తాయి. ఎంతో మంది ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. ఈ మార్గంలో కేవలం ఒకే రైలు నడుస్తుంది. దాని పేరు శకుంతల ఎక్స్‌ప్రెస్‌. ఇది ఒక ఈ రైల్వే లైన్‌ మొత్తం (190 కిలోమీటర్లు) ప్రయాణించాలంటే 6-7 గంటల సమయం పడుతుంది. ఈ ట్రెయిన్‌ 7 కోచ్‌లను మాత్రమే కలిగి ఉంటుంది. 1994 వరకు దీన్ని స్టీమ్‌ ఇంజిన్‌తో నడిపించేవారు. కానీ ఆ సంవత్సరంలో డీజిల్‌ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ ట్రెయిన్‌ డీజిల్‌ ఇంజిన్‌తో నడుస్తోంది.

ఇక ఈ రైల్వే లైన్‌కు ఏటా ఆ బ్రిటిష్‌ కంపెనీ రూ.1.20 కోట్లను తీసుకుంటుంది కనుక దీని మెయింటెనెన్స్‌ను కూడా అసలుకు వారే చూసుకోవాలి. కానీ దాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో 60 సంవత్సరాల కిందట వేసిన లైన్‌నే ఇప్పటికీ వాడుతున్నారు. 2014, 2016లో ఈ ట్రాక్‌ను మూసేశారు. రిపేర్ల అనంతరం మళ్లీ తెరిచారు. కాగా ఈ రైల్వే లైన్‌ను కొనుగోలు చేయాలని భారతీయ రైల్వే ప్రయత్నించింది. కానీ సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అలా చేస్తే ఈ రైల్వే లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చి సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. మరి అది నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top