ఇక మనకంటూ ప్రైవేసీ అంటూ ఉండబోదు ఇక. అంతా పారదర్శకమే జీవితమన్నాక సవాలక్ష భావోద్వేగాలు భావాలు ఆలోచనలు అభిప్రాయాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సమాజం వరకు వస్తేనే ప్రశ్నించేందుకు వీలవుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు. దేశ వ్యాప్తంగా 110 మంది కోట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడైనా .ఎక్కడైనా తీసుకునే వీలును కల్పిస్తూ బీజేపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మనం రహస్యం అనుకున్న ప్రతి సమాచారాన్ని పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో మన బ్యాంకు ఖాతాలు , లావాదేవీలు, నిక్షిప్తం చేసుకున్న డేటా అంతా ఇక కంప్యూటర్లలో ఉంటే ప్రమాదమే. ఎందుకంటే గవర్నమెంట్ నిన్ను టార్గెట్ చేస్తే.కొంప కొల్లేరవుతుంది. అప్పుడెప్పుడో తెలుగు సినిమాలో ఓ పాత్ర ద్వారా పలికిన మాటలు ఇప్పడు నిజం కాబోతున్నాయి. కొంపలో కుంపటి.అంటే ఇదే కాబోలు.
ఎంతో కొంత ప్రైవసీ లేకపోతే లైఫ్‌కు అర్థం ఏముంటుంది. దేశంలోని ఇంటెలిజెనస్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అనేక అధికారాలు కట్టబెడుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సమాచారాన్నైనా చూడొచ్చంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నాయి. దేశంలోని ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఎక్కడికైనా వెళ్లి తనిఖీ చేసే వీలు కలుగుతుంది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెసులుబాటు కల్పించారు. కంప్యూటర్లలో స్టోర్ చేసిన డేటాను , డిలీట్ చేసిన ఫైల్స్‌ను తిరిగి బ్యాకప్ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది. దర్యాప్తు సంస్థలు .మానిటరింగ్, డిటెక్ట్ చేయొచ్చు.మన కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్లయింది. దీనర్థం మన బతుకులు మన చేతుల్లో ఉండవన్న మాట. ఏదీ రహస్యం కాదు.అంతా బహిర్గతమే.
పూర్తిగా బీజేపీ కంట్రోల్లోకి వెళ్లిపోతారు జనమంతా. మన సమాచారం వారి గుప్పిట్లో.పరిశోధనా సంస్థల చేతుల్లో ఉండి పోతుంది. ఇక మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అంతా వారే నిర్ణయిస్తారు. కొన్ని చోట్ల గోప్యత పాటించాల్సి ఉంటుంది. వేలాది కంపెనీలు తమకంటూ ఓ పాలసీని ఏర్పాటు చేసుకుంటారు. ఆయా కంపెనీలు పూర్తిగా ఓ టీంను సీక్రెట్‌గా ఏర్పాటు చేసుకుంటుంది. పోటీ కంపెనీలను తట్టుకోవడం ఇందులో భాగమే. ఈ ఒక్క నిర్ణయంతో అవన్నీ ఏవీ పనిచేయవు. అవసరమని అనిపిస్తే ఏ సంస్థ అయినా నేరుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. లేదా ఉన్న పళంగా లైన్లోకి వస్తుంది. అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం, దాచుకోవడంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, కేబినెట్ సెక్రటేరియట్, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా), డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు. స్కానింగ్ లేదా పై అధికారులకు సంబంధించిన డేటాను తీసుకునే వీలు కలుగుతుంది. క్రియేట్ చేసిన లేదా స్టోరేజ్ లో ఉంచిన డేటాను ఈ నిర్ణయం వల్ల తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు (69)1 , 2000 కింద కేంద్ర హోం శాఖ ఉత్తర్వు జారీ చేయడంపై అన్ని వర్గాలు, సంస్థలు, మేధావుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు ఆనంద్ శర్మ లాంటి కాంగ్రెస్ నేతలు మోడీపై నిప్పులు చెరిగారు. మొత్తం మీద మనం కాపాడుకుంటూ .దాచుకున్న సమాచారం ఏదీ భద్రం కాదన్నది వాస్తవం.